జమ్ము: ఒక వ్యక్తి థార్ వాహనాన్ని రాంగ్ రూట్లో డ్రైవ్ చేశాడు. (Road Rage) స్కూటర్‌పై వెళ్తున్న వృద్ధుడ్ని ఢీకొట్టాడు. రోడ్డుపై పడిన ఆ వృద్ధుడు పైకి లేవగా రివర్స్‌లో వచ్చి ఆయనను ఢీకొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం జమ్మూలో ఈ సంఘటన జరిగింది. థార్ డ్రైవర్ వాహనాన్ని రాంగ్ రూట్లో నడిపాడు. ఆ లేన్‌లో వెళ్తున్న స్కూటర్‌ను ఢీకొట్టాడు. దీంతో స్కూటర్ నడుపుతున్న వృద్ధుడు రోడ్డుపై పడ్డాడు.
కాగా, పైకి లేచిన ఆ వృద్ధుడు థార్ డ్రైవర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి రివర్స్‌లో థార్‌ను డ్రైవ్ చేశాడు. రోడ్డుపై నిల్చొన్న వృద్ధుడ్ని వాహనం వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో ఆ వృద్ధుడు రోడ్డుపై పడిపోయాడు. థార్ నుంచి దిగిన ఆ వ్యక్తి కిందపడిన వృద్ధుడ్ని తిట్టాడు. ఆ తర్వాత వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరోవైపు అక్కడున్న జనం ఇదంతా చోద్యం చూశారు. ఎవరూ కూడా ఆ వ్యక్తిని నిలదీయలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రాంగ్ రూట్లో వచ్చి వృద్ధుడి స్కూటర్‌ను ఢీకొట్టడంతోపాటు రివర్స్‌లో వచ్చి ఆయనపై వాహనం దూకించడంపై నెటిజన్లు మండిపడ్డారు. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
Road rage kalesh, Jammu city
Pehele Thar wala wrong way se aya jis se ye uncle gir gaye phir reverse gear mai laya aur uncle ko piche se thoka befaltu mai.pic.twitter.com/NebTAkhlWz— Deadly Kalesh (@Deadlykalesh) July 28, 2025
Also Read:
MNS Assaults Coaching Centre Head | కోచింగ్ సెంటర్ అధిపతిపై.. ఎంఎన్ఎస్ వ్యక్తులు దాడి
Poorest Man In Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో మరో పేద వ్యక్తి.. ఆదాయం సున్నా