కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రధాని మోదీపై మండిపడ్డారు. మాల్దీవుల అధ్యక్షుడిని కౌగిలించుకునే ముందు ఆయన మతం ఏమిటని మీరు అడిగారా? అని ప్రశ్నించారు. మాల్దీవులకు రూ.4,850 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌కు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. సోమవారం బిర్భూమ్ జిల్లాలోని బోల్పూర్లో చేపట్టిన భాషా ఉద్యమాన్ని మమతా బెనర్జీ ప్రారంభించారు. తన జీవితాన్ని వదులుకుంటాను కానీ తన భాషను ఎవరూ లాక్కోనివ్వబోనని అన్నారు.
కాగా, ఈ సందర్భంగా ప్రధాని మోదీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘మీరు అరబ్ దేశాలకు వెళ్లి షేక్‌లను కౌగిలించుకున్నప్పుడు, వారు హిందువులా లేదా ముస్లింలా అని అడుగుతారా?’ అని ప్రశ్నించారు. మోదీ మాల్దీవుల పర్యటనను కూడా ఆమె తీవ్రంగా విమర్శించారు. ‘బెంగాల్‌కు రావాల్సిన బకాయిలు ఇవ్వని మీరు, మాల్దీవుల అధ్యక్షుడ్ని కౌగిలించుకుని 5,000 కోట్లు విరాళంగా ఇచ్చినప్పుడు ఆయన మతం ఏమిటని మీరు అడిగారా?’ అని దుయ్యబట్టారు.
మరోవైపు భాష ఆధారంగా విభజనను తాను కోరుకోవడం లేదని మమతా బెనర్జీ తెలిపారు. బెంగాలీ వలసదారులపై దాడులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఎన్ఆర్సీ, నిర్బంధ శిబిరాలను బెంగాల్లో అనుమతించబోనని స్పష్టం చేశారు.
Also Read:
Farmer Annual Income Rs.3 | దేశంలోనే పేద రైతు.. వార్షిక ఆదాయం రూ.3గా ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ
Man Killes Colleague | పది వేలు అప్పుగా ఇవ్వనందుకు.. వ్యక్తిని హత్య చేసిన సహోద్యోగి