Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఒక గొప్ప తండ్రిగా తన బాధ్యతలను, ప్రేమని ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటారు. తాజాగా తన పెద్ద కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల పుట్టినరోజును పురస్కరించుకుని చిరు ఎమోషనల్ నోట్‌ని అభిమానులతో పంచుకున్నాడు.
నా వేలు పట్టుకుని నడకలు నేర్చుకున్న ఆ చిన్నారి నుంచి.. ఈరోజు ఎంతో బాధ్యతాయుతమైన, హుందాతనమున్న స్త్రీగా ఎదిగిన నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఒకప్పుడు తన సినిమాలను చూస్తూ మురిసిపోయిన నా కూతురు, ఈరోజు నా సినిమాకే నిర్మాతగా మారి, తనకు ఒక మెమరబుల్ బ్లాక్‌బస్టర్‌ను అందించడం ఒక తండ్రిగా తనకు దక్కిన అత్యంత ప్రత్యేకమైన గౌరవమని చిరు కొనియాడారు. నా ప్రియమైన హనీ పాపా.. నువ్వు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని, ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ కీర్తి ఇలాగే వెలుగులీనాలి అంటూ మెగాస్టార్ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు. ఈ పోస్ట్‌కి చిరంజీవి తన కూతురిని చిన్నప్పుడు ఎత్తుకున్న ఫోటోతో పాటు, ప్రస్తుత ఫోటోను కూడా జత చేశాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.