కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్
‘కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్, మూడేండ్లలో రాష్ర్టాన్ని సర్వనాశనం చేశారు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విమర్శించారు.
- మూడేండ్లలో రాష్ట్రం సర్వనాశనం
- ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
- బీఆర్ఎస్లో భారీగా చేరికలు
శామీర్‌పేట, నవంబరు 22 : ‘కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్, మూడేండ్లలో రాష్ర్టాన్ని సర్వనాశనం చేశారు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విమర్శించారు. జవహర్‌నగర్‌లో ఆదివారం భారీ ఎత్తున వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు చామకూర మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. దాదాపు 150 మంది నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ మహేశ్ గుప్తా, మాజీ మేయర్ మేకల కావ్య, మాజీ కార్పొరేటర్లు పల్లపు రవి, అలూరు సంగీత, అశోక్, రాజేశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. నీళ్లు లేవు, కరెంట్ లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాల అమలు కావడం లేదన్నారు. సొంత పార్టీ నేతలే సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారంటే ఆయన పనితీరు అర్థం అవుతుందన్నారు. మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో జవహర్‌నగర్ అధోగతి పాలైందని ఆరోపించారు. బీఆర్ఎస్ జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుందన్నారు.
రూ.500 కోట్లతో కరెంట్ ఉత్పత్తి కేంద్రం, మురుగనీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎంపీగా ఉన్నప్పుడు రాంకీపై కేసు వేసి రేవంత్‌రెడ్డి సీఎం కాగానే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. డంపింగ్ యార్డు తొలగింపు ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. కాగా, పొలాస అశోక్, రాజేశ్వర్, రాము, పరమేశ్, ప్రభాకర్, రాజు, హరీశ్, అజిమ్, అరవింద్, సంజయ్, సంపత్, అనిల్, గణేశ్, సంతోష్, వంశీ తదితరులతో సహా 150 మంది బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గులాబీ కండువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు.
డంపింగ్ యార్డు ఎత్తివేసే వరకు ఉద్యమం

మేడ్చల్, నవంబర్ 22 : డంపింగ్‌యార్డు ఎత్తివేసే వరకు ఉద్యమం ఆపేది లేదని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. డంపింగ్‌యార్డు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చెన్నాపురం చౌరస్తా వద్ద డంపింగ్‌యార్డు జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభించిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించి, సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుతో జవహర్‌నగర్, నాగారం, దమ్మాయిగూడ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు.
గాలి, భూమి, నీరు కలుషితమయ్యాయన్నారు. చెత్త నుంచి వెలువడుతున్న విష వాయువుల కారణంగా రోజుకు ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యధిక విష వాయులు వెలువడే డంపింగ్ యార్డుల్లో జవహర్‌నగర్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉందన్నారు. ఇంకా డంపింగ్‌యార్డును ఇలాగే కొనసాగిస్తే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. డంపింగ్ యార్డు ఎత్తివేసే వరకు ఊరుకునేది
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

