వరంగల్.. ఫ్యూచర్ సీటీ
‘అసలైన ఫ్యూచర్ సిటీ వరంగల్.. దీని అభివృద్ధి పూర్తి బాధ్యత నాది. మూడేండ్లుగా నగరాభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం మరిచింది.
- నగరాభివృద్ధి బాధ్యత నాదే..
- మూడేండ్లుగా అభివృద్ధిని మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
- గులాబీ పాలనలోనే ప్రగతి పరుగులు
- సభ భయంతోనే కుడా కార్యాలయం మార్పు వెనుకకు..
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- పార్టీలో చేరిన విద్యా సంస్థల అధినేత, మాజీ కార్పొరేటర్లు
- కండువా కప్పి ఆహ్వానించిన రామన్న
హనుమకొండ, నవంబర్ 22 : ‘అసలైన ఫ్యూచర్ సిటీ వరంగల్.. దీని అభివృద్ధి పూర్తి బాధ్యత నాది. మూడేండ్లుగా నగరాభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం మరిచింది. బీఆర్ఎస్ పాలనలోనే ప్రగతి పరుగులు పెట్టింది. సభ భయంతోనే కాళోజీ కళాక్షేత్రంలోకి మార్చిన కుడా కార్యాలయం విషయంలో సర్కారు వెనుకకు తగ్గింది’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏకశిల విద్యా సంస్థల అధినేత గౌరు తిరుపతిరెడ్డితోపాటు పలువురు మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం సాయం త్రం మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన జన చైతన్య సభలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతిరెడ్డితో పాటు మాజీ కార్పొరేటర్లకు గులాబీ కుండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ సమీపంలో కేసీఆర్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం భూములు సేకరిస్తే, కాంగ్రెస్ సర్కారు దాని పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అని ప్రచారం చేసుకుంటోందని, నిజమైన భవిష్యత్ ఉన్న నగరం వరంగల్ అని అన్నారు. దీన్ని రాష్ట్రంలోనే ప్రధాన పారిశ్రామిక, ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పా టు అభివృద్ధి చేసే పూర్తి బాధ్యతను భవిష్యత్‌లో తాను తీసుకుంటానని ప్రకటించారు. కేసీఆర్ పాలనలో వరంగల్‌ను రాష్ట్రంలోనే ప్రధాన పారిశ్రామిక, విద్య, వైద్య, ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు పునాదులు వేశామని తెలిపారు. వై నాట్ వరంగల్ లక్ష్యంతో 24 అంతస్తులు, 2,250 పడకలు, 35 వైద్య విభాగాలతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను 90 శాతం పూర్తిచేశామని చెప్పారు.
జనగామ, మహబూబాబాద్ దవాఖానల పనులు కూడా దాదాపు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేసి వైద్య విద్యకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. మడికొండ ఐటీ పారులో ఎల్అండ్టీ మైండ్ ట్రీ, సైయెంట్, టెక్ మహీంద్రా, క్వాడ్రంట్ వంటి కంపెనీలను తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పారులో కిటెక్స్, గణేశా ఎకోస్పియర్, యంగ్ వన్ వంటి పరిశ్రమలను తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించామన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్యను పరిషరించామని, రూ.150 కోట్లతో రెండు సమీకృత కలెక్టరేట్లు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
మూడేళ్లలో కాంగ్రెస్ ఏం చేయలే..

మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో వరంగల్‌కు ఒక కొత్త ఐటీ కంపెనీని, ఒక కొత్త పరిశ్రమను తీసుకురాలేకపోయారని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే ఉన్న కంపెనీలు కూడా మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మిగిలిన పనులను కూడా పూర్తి చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రైవేట్ దవాఖానల ప్రారంభోత్సవాలకు మాత్రం ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. పేదల కోసం నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించకుండా, మెడికవర్ హాస్పిటల్‌ను ప్రా రంభించడంపై ప్రశ్నలు సంధించారు. ఆ ఆసుపత్రితో ముఖ్యమంత్రికి బినామీ సంబంధాలున్నాయని ఆరోపించారు.
మిషన్ భగీరథ ద్వారా వరంగల్ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో వరంగల్ అభివృద్ధికి నిధుల వరద పారిందన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరు మీద 1,217 మంది కూర్చునే సామ ర్థ్యంతో నిర్మించిన కళాక్షేత్రంలో కుడా కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ప్ర భుత్వ నిర్ణయాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. కవులు, కళాకారులు, రచయితల కోసం నిర్మించిన కళాక్షేత్రాన్ని ప్రభుత్వ కార్యాలయంగా మార్చాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. వరంగల్ ప్రజల వ్యతిరేకత, జనచైతన్య సభ భయంతోనే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనకి తీసుకుందని అన్నారు. వరంగల్‌తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడే కాగడాల ప్రదర్శనలో కవాతు చేసిన రోజులు, 17 ఏళ్ల క్రితం నవంబర్ 29న అరెస్టయి వరంగల్ సెం ట్రల్ జైలులో ఖైదీగా గడిపిన సందర్భాన్ని గుర్తుచేశారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం సాగిన ప్రతి కీలక సందర్భంలోనూ వరంగల్ అండగా నిలిచిందని, ఉద్యమ మహాగర్జన నుంచి తెలంగాణ రజతోత్సవ సభ వరకు ఓరుగల్లు ప్రజలు అందించిన మద్దతును ఎప్పటికీ మరువలేమని పేరొన్నారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. వరంగల్ అభివృద్ధి, యువతకు ఉపాధి, ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పరీక్షా సమయంలోనూ ఓరుగల్లు అండగా నిలిచిందని, భవిష్యత్‌లోనూ వరంగల్ ప్రజల ఆశీర్వాదం తమకు ఉంటుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడుతున్న క్రమంలో వచ్చిన వారంతా కేరింతలు కొట్టారు.
కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మండలి డిపూ ్యటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ ఉప ముఖ్య మంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రెడ్యా నాయక్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తకళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్ నాయక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటే శ్వర్లు, మర్రి యాదవరెడ్డి, కేతిరి వాసుదేవరెడ్డి, మెట్టు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి, పెద్ది స్వప్న, తదితరులు పాల్గొన్నారు. కాగా, అనుకున్న కంటే ఎక్కువ జనం వచ్చి సభ విజయవంతమైందని పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపించింది.
విద్యారంగ అనుభవాన్ని ప్రజా సేవకు వినియోగిస్తా

25 ఏళ్ల విద్యారంగ అనుభవంతో పాటు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని సమాజ సేవకు మరింత విస్తృతంగా వినియోగించాలనే సంకల్పంతో బీఆర్ఎస్లో చేరా. నా జీవితంలో ఈ రోజు ఒక మైలురాయి. నా ప్రయాణంలో కొత్త మలుపు. సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి, కష్టపడి పట్టుదలతో ముందుకు సాగడం నేర్చుకున్నా. వరంగల్ గడ్డపై ఏకశిలా విద్యాసంస్థలను ప్రారంభించినప్పుడు పెద్దగా ఆస్తులు లేకపోయినా విద్యా రంగంలో ఏదైనా సాధించాలనే బలమైన సంకల్పం ఉండేది. చిన్న స్థాయిలో ప్రారంభమైన విద్యాసంస్థలు నేడు పది జిల్లాల్లో 24 సంస్థలుగా విస్తరించి, 14 వేల మందికి పైగా విద్యార్థులకు విద్యను అందిస్తున్నాయి.
వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయడం గొప్ప సంతృప్తినిచ్చింది. విద్యతోపాటు ఆరోగ్యం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి కూడా సమాజానికి ఎంతో ముఖ్యం. నా ఆలోచనలు, ఆశయాలు మారలేదు. సేవా పరిధి మాత్రమే విస్తరిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నాయకత్వం, పోరాట పటిమ, రాష్ట్ర నిర్మాణంలో ఆయన పాత్ర స్ఫూర్తినిచ్చాయి. కేటీఆర్ నాయకత్వ లక్షణాలు, ప్రజలతో ఆయనకున్న అనుబంధం, తెలంగాణ అభివృద్ధిపై నిబద్ధత నన్ను ప్రభావితం చేశాయి. రాజకీయాల్లోకి రావడం పదవుల కోసం కాదు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిషారానికి కృషి చేయడమే నా లక్ష్యం. పార్టీ అప్పగించే ఏ బాధ్యతనైనా నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో నిర్వహిస్తా. నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు.
– గౌరు తిరుపతిరెడ్డి, ఏకశిల విద్యాసంస్థల అధినేత
కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు

కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనపై విసుగెత్తిన ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు. గత మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో పలువురు నాయకులు, విద్యావేత్తలు, యువకులు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇందులో భాగంగా కేటీఆర్ సమక్షంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. అందులో భాగంగా వరంగల్ నగర పరిధి నుంచి సైతం పెద్ద సంఖ్యలో పలువురు పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కేటీఆర్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
– దాస్యం వినయ్ భాస్కర్, మాజీ చీఫ్ విప్
బీఆర్ఎస్కు పూర్వవైభవం తెస్తాం..
బీఆర్ఎస్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందు కు శక్తివంచన లేకుండా పనిచేస్తాం. వరంగల్ అభివృద్ధికి గత ప్రభు త్వ హయాంలోనే బలమైన పునాదులు పడ్డా యి. నగర మేయర్‌గా పనిచేసి న సమయంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అందించిన సహకారం, ప్రోత్సాహం మరువలేనిది. కేవలం రాజకీయ సమావేశం కోసమే ఈ సభ నిర్వహించలేదు. ఎన్నికల సమ యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను, ప్రజా సమస్యల పరిషారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకే కేటీఆర్ ప్రజల్లోకి వచ్చారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. కేటీఆర్ నాయకత్వంలో యువత రాష్ట్ర భవిష్యత్‌కు దిక్సూచిగా నిలవాలి.
– నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

