ముంబై: రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబైలోని ఒక కోచింగ్ సెంటర్ అధిపతిని ఆ పార్టీ గూండాలు కొట్టారు. (MNS Assaults Coaching Centre Head) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కళ్యాణ్ శివారులోని సిద్ధార్థ లాజిక్ కోచింగ్ సెంటర్‌ను సిద్ధార్థ్ సింగ్ చందేల్ నిర్వహిస్తున్నాడు. పలు పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఈ సంస్థ అధిక ఫీజులు వసూలు చేస్తూ క్లాసులు నిర్వహించడం లేదని ఆరోపణలు వచ్చాయి.
కాగా, ఈ ఆరోపణల నేపథ్యంలో ఎంఎన్ఎస్కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆ కోచింగ్ సెంటర్‌కు వెళ్లారు. దాని యజమాని సిద్ధార్థ్ సింగ్ చందేల్‌పై వారు దాడి చేశారు. ఒక వ్యక్తి ఆయన చెంపపై కొట్టాడు. మరొకరు స్టీల్ బాటిల్, మూడో వ్యక్తి చెక్కముక్క విసిరారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ సింగ్ చందేల్ వారిని ప్రాధేయపడ్డాడు. కొందరు బాలికలు కూడా అక్కడ ఉన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎంఎన్ఎస్ కార్యకర్తల ఆగడాలపై విమర్శలు వెల్లువెత్తాయి.
मुंबई के कल्याण में MNS पदाधिकारियों ने कोचिंग सेंटर के संचालक को थप्पड़ जड़ दिया. पदाधिकारियों ने आरोप लगाया कि कोचिंग सेंटर की फीस ज्यादा है और निदेशक छात्रों के साथ धोखाधड़ी कर रहे हैं.#MNS | #CoachingCenter pic.twitter.com/qwfATqx9Fo
— NDTV India (@ndtvindia) July 28, 2025
Also Read:
Poorest Man In Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో మరో పేద వ్యక్తి.. ఆదాయం సున్నా
Farmer Annual Income Rs.3 | దేశంలోనే పేద రైతు.. వార్షిక ఆదాయం రూ.3గా ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ