Benjamin Netanyahu | ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బతికే ఉన్నారా..? లేటెస్ట్ వీడియోపై అనుమానాలు
Benjamin Netanyahu : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉనికిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన బతికే ఉన్నారా, లేక మరణించారా అనే విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి.
Benjamin Netanyahu : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉనికిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన బతికే ఉన్నారా, లేక మరణించారా అనే విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం తాజాగా విడుదలైన నెతన్యాహు వీడియోనే. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలై రెండు వారాలు దాటింది. ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని మరణించాడు. అయితే, యుద్ధం మొదలైనప్పటినుంచి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఎలాంటి సమావేశాల్లోనూ కనిపించలేదు.
ఆయన మీటింగ్‌లో పాల్గొన్నట్లు, కొన్ని ప్రదేశాల్ని సందర్శించినట్లు పలు ఫొటోలు, వీడియోలు విడుదలయ్యాయి. అయితే, వాటి విషయంలోనూ సందేహాలున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం రోజూ ఏదో ఒక రకంగా మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. పలు సమావేశాలకు హాజరవుతున్నారు. ఇలాంటి సమయంలో నెతన్యాహు కనిపించకపోవడానికి గల కారణాలు ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మరణించారా అని చాలా మంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై భీకరంగానే దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో నెతన్యాహు మరణించి ఉండొచ్చని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఖండిస్తున్నప్పటికీ, ఈ వాదన నిజమనిపించేలా ఆయన బహిరంగంగా కనిపించడం లేదు. ఇదే సమయంలో తాజాగా ఇజ్రాయెల్ విడుదల చేసిన ఒక వీడియో సంచలనం రేపుతోంది. ఆ వీడియోలో నెతన్యాహు మాట్లాడారు. కానీ, బాగా గమనిస్తే ఆ వీడియోలో ఆయన చేతికి ఆరు వేళ్లున్నాయి.
నిజానికి ఆయన చేతికి ఆరు వేళ్లు లేవు. దీంతో అది ఏఐ వీడియో అని, నెతన్యాహు మరణించి ఉండొచ్చనే అనుమానాలు మొదలయ్యాయి. ఆయన ఉన్నారని ప్రపంచాన్ని నమ్మించడానికే ఇలా ఏఐ వీడియో విడుదల చేశారని ఇరాన్ అనుకూల విశ్లేషకులు అంటున్నారు. ఏఐ వీడియోల్లో మాత్రమే ఇలా కొన్నిసార్లు మనుషుల చేతికి ఆరు వేళ్లు కనిపించడం చాలాసార్లు చూశామని, అందువల్ల అది ఏఐ వీడియోనే అంటున్నారు. అయితే, దీనిపై ఏఐ చాట్‌బోట్ అయిన గ్రోక్ ఒక సమాధానం చెప్పింది. వీడియో రికార్డ్ చేసేటప్పుడు కెమెరా యాంగిల్స్, ఫ్రేమింగ్‌లో లోపాల వల్ల అప్పుడప్పుడూ చేతికి ఆరువేళ్లు ఉన్నట్లు కనిపించడం సహజమేనని, ఇది ఒరిజినల్ వీడియోనే అని గ్రోక్ తెలిపింది. ఏదేమైనా నెతన్యాహు బతికి ఉన్నారా.. లేదా అనే విషయంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ నుంచి స్పష్టత వస్తే, లేకుంటే నెతన్యాహు బయటకు వస్తేనే దీనికి సమాధానం దొరుకుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

