అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి గ్యాస్ సరఫరాకు ఇబ్బంది లేదని రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్( Payyavula Keshav ) , అచ్చెన్నాయుడు ( Acchennaidu ) వెల్లడించారు. శనివారం పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన సమావేశం అనంతరం వారు మాట్లాడారు.
గ్యాస్ ( Gas ) విషయంలో సొమ్ము చేసుకోవాలని చూస్తే డీలర్ల( Dealers ) పై, సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహాలు,ఆస్పత్రులు, హాస్టళ్లు, ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ పంపిణీ చేయాలని, సిలిండర్ బుకింగ్ ఆన్లైన్లోనే జరగాలని స్పష్టం చేశామని వివరించారు.
మొదట బుక్ చేసుకున్న వారికి డెలివరీలో మొదటి ప్రాధాన్యత ఇవ్వలన్నారు. గ్యాస్ దొరకదేమో అనే ఆందోళనతో బుకింగ్ చేయవద్దని సూచించారు. గ్యాస్ సరఫరాపై కేంద్రంతో నిరంతర సంప్రదింపులతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. వినియోగ దారులకు పైప్లైన్ ద్వారా వినియోగించే ఆలోచనలు చేస్తున్నామని, పైప్లైన్ గ్యాస్ సరఫరాదారులతోనూ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ విషయంలో సీఎం మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారని వివరించారు.