మాస్కో: రష్యాపై భీకర స్థాయిలో డ్రోన్లతో అటాక్ చేసింది ఉక్రెయిన్. శనివారం రష్యా చేసిన దాడికి ప్రతీకారంగా ఉక్రెయిన్ విరుచకుపడింది. అయితే వ్లాదిమిర్ ప్రాంతంలో ఉన్న వేర్‌హౌజ్(Russian Warehouse)ను టార్గెట్ చేసింది. రష్యాన్లో ఆన్లైన్ రిటేలర్‌గా ఉన్న వైల్డ్‌బెర్రీస్ వేర్‌హౌజ్‌పై దాడి చేసింది. దీన్ని రష్యా అమెజాన్‌గా కీర్తిస్తుంటారు. మాస్కోకు సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్లాదిమిర్ ప్రాంతంలో ఉన్న వేర్‌హౌజ్‌ను డ్రోన్‌తో అటాక్ చేసినట్లు వీడియోలు రిలీజ్ అయ్యాయి. వైల్డ్ బెర్రీస్ వేర్‌హౌజ్.. రష్యాలో కీలకమైన లాజిస్టిక్ హబ్. అయితే ఆ కేంద్రాలను ఉక్రెయిన్ టార్గెట్ చేస్తున్నది. రష్యా మిలిటరీకి డ్రోన్ కాంపోనెంట్లు, నావిగేషన్ ఎక్విప్మెంట్, ఇతర సామాగ్రిని ఈ వేర్‌హౌజ్‌ల నుంచి సరఫరా చేస్తుంటారు. వైల్డ్‌బెర్రీస్ సైట్లపై ఇటీవల ఉక్రెయిన్ వరుసగా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం రష్యా బాలిస్టిక్ క్షిపణులతో కీవ్‌పై దాడి చేసింది. ఆ ఘటనలో 9 మంది మృతిచెందగా, డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.