– 12 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలు కైవసం
వైరా, ఆగస్టు 03 : సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్ లీగ్స్ – 2026 పోటీల్లో వైరాకు చెందిన కరాటే విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఖమ్మంలో టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో ఈ కరాటే పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో రఘు మాస్టర్ వద్ద శిక్షణ పొందుతున్న వైరా విద్యార్థులు పాల్గొని విశేష ప్రతిభ చాటారు. మొత్తం 12 స్వర్ణ పతకాలు, 9 రజత పతకాలు, 11 కాంస్య పతకాలు సాధించారు. టూర్నమెంట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థులను, మాస్టర్ జి.రఘుకు స్థానికులు అభినందనలు తెలిపారు.