మూడు నెలలుగా వేతనాలు అందని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు
గత మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని, కుటుంబ పోషణ కూడా గడవడం లేదని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు నిలిచిపోయినప్పటికీ బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నామని, వెంటనే తమ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ..
జూలూరుపాడు, ఆగస్టు 03 : గత మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని, కుటుంబ పోషణ కూడా గడవడం లేదని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు నిలిచిపోయినప్పటికీ బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నామని, వెంటనే తమ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ సోమవారం జూలూరుపాడు ఎంపీఓ తులసీరామ్ కి ఆయన కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మాట్లాడుతూ… ఇతర ఉపాధి హామీ సిబ్బంది చేస్తున్న ‘పెన్-డౌన్’ నిరసన కార్యక్రమానికి తాము దూరంగా ఉన్నామని స్పష్టం చేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పనులను సజావుగా నడిపిస్తున్నామని తెలిపారు. జులై 31 వరకు క్షేత్రస్థాయిలో కూలీలతో పనులు చేయించి, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మస్టర్లను నమోదు చేసి పంపించినప్పటికీ పేమెంట్లు నిలిచిపోవడం దారుణమన్నారు.
వరుసగా మూడు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం అత్యంత ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విధులు నిర్వర్తిస్తున్నామని, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న మూడు నెలల జీతాలను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఫీల్డ్ అసిస్టెంట్లు ఎం.రమేష్, జి.హరికృష్ణ, జి.నాగేష్, బి.జగదీష్, ఎ.లక్ష్మణ్, డి.నాగేశ్వరరావు, బి.బాలు, డి.రవి, ఎస్.భద్రం, షేక్ బాజీ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

