ముంబై: మహిళా ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థిని లైంగికంగా వేధించింది. సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు పంపింది. అలాగే అర్ధనగ్నంగా ఆ స్టూడెంట్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడింది. (Teacher Video Call With Student) ఇది పేరెంట్స్‌కు తెలియడంతో ఆ లేడీ టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఒక స్కూల్‌కు చెందిన 35 ఏళ్ల లేడీ టీచర్, స్టూడెంట్ను లైంగికంగా వేధించింది. కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆ బాలుడికి అసభ్యకరమైన సందేశాలు పంపింది. అతడితో చాటింగ్ కూడా చేసింది.
కాగా, ఇటీవల ఆ ఉపాధ్యాయురాలి ప్రవర్తన సృతిమించింది. అర్ధనగ్నంగా వీడియో కాల్ చేసి ఆ బాలుడితో మాట్లాడుతున్నది. ఈ విషయం బాలుడి తండ్రికి తెలిసింది. దీంతో పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు. ఆ లేడీ టీచర్ చర్యల వల్ల తన కుమారుడి మానసిక ఆరోగ్యం ప్రభావితమైందని ఆరోపించాడు.
మరోవైపు బాలుడి తండ్రి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ లేడీ టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఆమె మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆధారాల కోసం ఆ ఉపాధ్యాయురాలి సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఇతర విద్యార్థులతో కూడా ఆమె అలా ప్రవర్తిస్తున్నదా? అన్నది కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Father Kills Son | పదేళ్ల కొడుకును చంపిన తండ్రి.. భార్యకు సమాచారం ఇచ్చి పరార్
Residence Certificate For Dog | మరో కుక్కకు నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు.. బీహార్‌లో ఘటన
Watch: రూ.70,000కుపైగా జీతాలు.. 11,18,19ను ఇంగ్లీష్‌లో రాయడంలో ప్రభుత్వ టీచర్లు విఫలం