Women And Girls Missing | మధ్యప్రదేశ్‌లో 23,000 మంది మహిళలు, బాలికలు మిస్సింగ్.. అసెంబ్లీకి వెల్లడించిన సీఎం
Women And Girls Missing | సుమారు 23,000 మంది మహిళలు, బాలికలు కనిపించడం లేదు. అత్యాచారం, మహిళలపై జరిగిన నేరాలతో సంబంధం ఉన్న 1,500 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఆ రాష్ట్ర సీఎం ఈ విషయాలను స్వయంగా అసెంబ్లీకి వెల్లడించారు.
భోపాల్: సుమారు 23,000 మంది మహిళలు, బాలికలు కనిపించడం లేదు. (Women And Girls Missing) అత్యాచారం, మహిళలపై జరిగిన నేరాలతో సంబంధం ఉన్న 1,500 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఆ రాష్ట్ర సీఎం ఈ విషయాలను స్వయంగా అసెంబ్లీకి వెల్లడించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో మహిళలు, బాలికలు అదృశ్యమవుతున్నారు. మహిళలపై అత్యాచార కేసులు కూడా పెరుగుతున్నాయ. మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలా బచ్చన్ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసుల వివరాలను అసెంబ్లీలో కోరారు.
కాగా, మధ్యప్రవేశ్ సీఎం మోహన్ యాదవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2024 జనవరి 1 నుంచి 2025 జూన్ 30 వరకు 21175 మంది మహిళలు, 1954 మంది బాలికలు అదృశ్యమయ్యారు. ఏడాదికిపైగా ఆ రాష్ట్రంలో తప్పిపోయిన మహిళల సంఖ్య 23129కు చేరుకున్నదని వెల్లడించారు.
మరోవైపు అత్యధికంగా సాగర్ జిల్లాలో 1,069 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు. జబల్పూర్ జిల్లాలో 946 మంది, ఇండోర్ జిల్లాలో 788 మంది, భోపాల్ (గ్రామీణ) జిల్లాలో 688 మంది, ఛతర్పూర్ జిల్లాలో 669 మంది, రేవా జిల్లాలో 653 మంది, ధార్ జిల్లాలో 637 మంది, గ్వాలియర్ జిల్లాలో 617 మంది మహిళలు అదృశ్యమయ్యారు.
కాగా, అత్యాచారం, మహిళలపై జరిగిన నేరాలతో సంబంధం ఉన్న 1,500 మంది నిందితులు పరారీలో ఉన్నారు. మహిళలపై అత్యాచారం చేసిన నిందితుల్లో 292 మంది, మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో 283 మంది అంటే మొత్తంగా 575 మంది అత్యాచార నిందితులు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. లైంగిక వేధింపుల కేసుల్లో పరారీలో ఉన్న వారి సంఖ్య 610కు చేరింది. మహిళలు, బాలికల అదృశ్యానికి సంబంధించిన ఇతర కేసుల్లో 320 మంది నిందితులు పరారీలో ఉన్నారు.
Also Read:
Watch: రూ.70,000కుపైగా జీతాలు.. 11,18,19ను ఇంగ్లీష్‌లో రాయడంలో ప్రభుత్వ టీచర్లు విఫలం
Residence Certificate For Dog | మరో కుక్కకు నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు.. బీహార్‌లో ఘటన
Watch: విధుల్లో చేరిన తొలిరోజే, గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి.. ఎందుకంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

