న్యూఢిల్లీ: పదేళ్ల కుమారుడ్ని తండ్రి హత్య చేశాడు. (Father Kills Son) విడిగా నివసిస్తున్న భార్యకు ఈ సమాచారం ఇచ్చి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నరేలా ప్రాంతంలో నివసిస్తున్న నరేంద్రతో విభేదాల వల్ల భార్య కోమల్ విడిపోయింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె వేరుగా నివసిస్తున్నది.
కాగా, మంగళవారం స్కూల్‌కు వెళ్లిన పదేళ్ల చిన్న కుమారుడు ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కోమల్ ఆందోళన చెందింది. ఇంతలో భర్త నరేంద్ర ఆమెకు ఫోన్ చేశాడు. చిన్న కుమారుడ్ని హత్య చేసినట్లు చెప్పాడు.
మరోవైపు కోమల్ ఫిర్యాదుతో పోలీసులు నరేంద్ర ఇంటికి చేరుకున్నారు. మెడపై గాయాలతో మరణించిన బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లి కోమల్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు నరేంద్రను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Residence Certificate For Dog | మరో కుక్కకు నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు.. బీహార్‌లో ఘటన
Watch: రూ.70,000కుపైగా జీతాలు.. 11,18,19ను ఇంగ్లీష్‌లో రాయడంలో ప్రభుత్వ టీచర్లు విఫలం