లక్నో: స్కూల్‌కు వచ్చిన విద్యార్థినిని ఒక వ్యక్తి గేటు వద్ద అడ్డుకున్నాడు. ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశాడు. (School Girl Kidnap) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కొన్ని గంటల్లోనే నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం 6.45 గంటలకు సెక్టార్ 53లోని గిజోడ్ ప్రాంతంలో ఉన్న మదర్ థెరిసా స్కూల్ వద్దకు కొంత మంది బాలికలు చేరుకున్నారు.
కాగా, ఆ స్కూల్ గేటు బయట ఒక వ్యక్తి కారుతో ఉన్నాడు. అక్కడకు చేరుకున్న ఒక బాలికను అతడు అడ్డుకున్నాడు. ఆమెతో మాట్లాడిన ఆ వ్యక్తి బలవంతంగా కారులోకి ఎక్కించాడు. అక్కడి నుంచి కారులో తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. ఆ స్కూల్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కారు నంబర్ ఆధారంగా కొన్ని గంటల్లోనే బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ బాలికను ఆ వ్యక్తి ఎందుకు కిడ్నాప్ చేశాడు అన్నది దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
सेक्टर 53 स्थित गिझोड गांव के मदर टेरेसा स्कूल के गेट के पास से कार सवार बदमाश 15 वर्षीय बच्ची का अपहरण करके ले गए, घटना सीसीटीवी में हुई कैद, #noidakhabar @noidapolice @vinodsharmanbt pic.twitter.com/rL0NW4TM1s
— NoidaKhabar.com (@noidakhabar) July 30, 2025
Also Read:
Watch: రూ.70,000కుపైగా జీతాలు.. 11,18,19ను ఇంగ్లీష్‌లో రాయడంలో ప్రభుత్వ టీచర్లు విఫలం
Residence Certificate For Dog | మరో కుక్కకు నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు.. బీహార్‌లో ఘటన