Student Assaulted : హైదరాబాద్ బాచుపల్లిలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమెకు మత్తు మందు ఇచ్చిన అశోక్ ఆమెపై లైంగికంగా దాడి చేయడమే కాకుండా.. మాట వినకుంటే నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని ఆమెను బెదిరించాడు. అతడి వేధింపులు తాళలేక సదరు యువతి శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో.. విషయం తెలసుకున్న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఆశిష్ అనే విద్యార్థి గత ఏడాది కాలంగా ANC అనే డార్క్ వెబ్ నుండి తన కూతురికి చాక్లెట్లు, టాబ్లెట్లు ఇచ్చి కాలేజ్, హోటల్లో లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆశిష్ అతని స్నేహితుడు ప్రవీణ్ కూడా వరుసగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపింది. తాను చెప్పినట్లు చేయకపోతే న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని, కాలేజ్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితురాలి తల్లి పోలీసుల మందు తన బాధను వెళ్లబోసుకుంది.
హైదరాబాద్ నగరంలో దారుణం
బాచుపల్లిలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన యువకుడు
ఆశిష్ అనే విద్యార్థి గత ఏడాదిగా ANC అనే డార్క్ వెబ్ నుండి తన కూతురికి చాక్లెట్లు, టాబ్లెట్లు ఇచ్చి కాలేజ్ మరియు హోటల్లో లైంగిక దాడులకు… pic.twitter.com/5bplq2oGDz
— Telugu Scribe (@TeluguScribe) March 2, 2026