Benjamin Netanyahu | ఇరాన్ దాడి తర్వాత బయటకొచ్చిన ఇజ్రాయేల్ ప్రధాని.. వీడియో..!
Benjamin Netanyahu : ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జరిపిన ప్రతీకార దాడుల నుంచి ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ(Benjamin Netanyahu) తప్పించుకున్నారు.
Benjamin Netanyahu : ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) జరిపిన ప్రతీకార దాడుల నుంచి ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) తప్పించుకున్నారు. సోమవారం జరిపిన భారీ క్షిపణుల దాడిలో ఆయనకు ఏమీ కాలేదు. దాడుల్లో తొమ్మది మంది మరణించారు. కానీ, నెతన్యాహూ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. కాసేపటికి క్షిపణులు కూల్చిన భవనం ముందు ప్రత్యక్షమైన ఆయన మృతులకు సంతాపం తెలిపారు.
అమెరికా, ఇజ్రాయేల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ టైగర్స్ రోర్’ తొలి రోజే ఇరాన్ తమ అగ్ర నేత అయతుల్లా అలీ ఖమేనీని కోల్పోయింది. నిఘా వర్గాల పక్కా సమాచారంతో టెహ్రాన్‌లోని ఖమోనీ నివాసంపై క్షిపణుల దాడికి తెగబడిన ఇజ్రాయేల్.. చివరకు ఆయనను అంతం చేసింది. తమ సుప్రీం లీడర్‌ను అంతమొందించడంలో కీలకమైన నెతన్యాహూను చంపేందుకు సోమవారం ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ భారీగా దాడులకు పాల్పడింది.
🚨Netanyahu says the difference between Israel and Iran is that Israel doesn’t target civilians.
“You see the difference. The tyrants of Tehran target civilians, we target the tyrants of Tehran to protect civilians.” pic.twitter.com/OiaBZUL9B7
— Skint Eastwood (@Skint_Eastwood1) March 2, 2026
నెతన్యాహూ లక్ష్యంగా టెవ్ అవీవ్‌లోని భద్రతా కార్యాలయంపై, జెరూసలేంలోని ప్రధాన సైనిక స్థావరాలపై ఐఆర్జీసీ క్షిపణులతో విరుచుకుపడింది. కానీ, ఆయన సురక్షితంగా బయటపడ్డారు. దాడుల అనంతరం జనం మధ్యలో కనిపించిన ఇజ్రాయేల్ ప్రధాని 9 మంది మృతులకు నివాళులు అర్పించారు. ‘ఇరాన్ ప్రభుత్వం ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపిస్తోంది. కానీ, మేము మాత్రం ప్రజల్ని వారి నుంచి కాపాడేందుకు యుద్ధం చేస్తున్నాం. మాకు వారికి మధ్య ప్రధాన తేడా ఇదే’ అని ఈ సందర్భంగా నెతన్యాహూ అన్నారు. .
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

