Jeddah : పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో విమానాల రాకపోకలు స్తంభించడంతో భారీ సంఖ్యలో భారతీయలు సౌదీ అరేబియాలో చిక్కుకుపోయారు. యుద్ధ విమానాలు, బాంబుల మోతతో భయభ్రాంతులకు గురవుతున్న వారిని కాపాడేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది.
జెడ్డాలో చిక్కుకున్న భారతీయలను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే జెడ్డా నుంచి మంగళవారం ప్రత్యేక విమానులు నడిపాలని భారత్ నిర్నయించింది. 10 ఇండిగో విమానాల్లో భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని సోమవారం పౌర విమానయాన శాఖ పేర్కొంది. జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌కు ఈ ప్రత్యేక విమానాలు వస్తాయని తెలిపింది.
STORY | IndiGo to operate 10 relief flights from Jeddah on March 3 amid Middle East crisis
IndiGo plans to operate 10 special relief flights from Jeddah to various Indian cities on March 3 to bring back passengers stranded due to the Middle East conflict.
READ:… pic.twitter.com/lP5GYvrSMg
— Press Trust of India (@PTI_News) March 2, 2026
‘సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయులును స్వదేశానికి తరలించేందుకు మార్చి 3న జెడ్డా నుంచి 10 ప్రత్యేక విమానాలు నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రణాళిలు వేస్తోంది. అయితే.. గగనతల మూసివేత విషయమై భారత కాన్సులేట్ జనరల్ సహకారం తీసుకుంటోంది ఇండిగో’ అని భారత విమానయానశాఖ ఒక ప్రకటనతో వెల్లడించింది. జెడ్డాలో చిక్కుకుపోయిన వారిలో మహారాష్ట్రకు చెందిన 5 వేల మంది ఉమ్రా యాత్రికులు ఉన్నారు.