Vanteru Pratap Reddy | మెదక్ జిల్లా ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ విస్తరణ పనులు నిలిపివేయాలని గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయనమెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్కు గ్రామస్తులతో కలిసి ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని చెట్ల గౌరారం, రంగయ్యపల్లి గ్రామస్తులు కాలుష్యంతో తీర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తిరిగి గ్రామస్తుల సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు.
పరిశ్రమ నుంచి విషపూరితమైన వాయు జల కాలుష్యం, శబ్ద కాలుష్యం రావడంతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. విషపూరితమైన కాలుష్యంతో ప్రజలు గుండె సంబంధిత, ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలతో క్యాన్సర్ వంటి రోగాలకు గురి అవుతున్నారు. తాగునీరు, సాగునీరు కలుషితమవుతుంది. ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమను పూర్తిగా మూసివేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వంటేరు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు.