France | రగులుతున్న ఫ్రాన్స్.. పాఠశాలల్లో సమస్యలపై జెన్ ఆల్ఫా సమరభేరి.. పదుల సంఖ్యలో స్కూళ్లకు నిప్పు
France | విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, టీచర్ ఖాళీల భర్తీని చేపట్టాలని, బడుల్లో మెరుగైన వసతులను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్‌లో రెండు వారాలుగా కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలు సోమవారం తీవ్రరూపం దాల్చాయి.
France | (స్పెషల్ టాస్క్ బ్యూరో) పారిస్, అక్టోబర్ 5: విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, టీచర్ ఖాళీల భర్తీని చేపట్టాలని, బడుల్లో మెరుగైన వసతులను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్‌లో రెండు వారాలుగా కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలు సోమవారం తీవ్రరూపం దాల్చాయి. తరగతులను బహిష్కరించిన విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీంతో 500 వరకూ స్కూల్స్ మూతబడ్డాయి. తమ నిరసనలను అడ్డుకొంటున్న పోలీసులపై మండిపడ్డ విద్యార్థులు.. చెత్త బుట్టలను కాల్చి విసిరేశారు.
దీంతో ఆందోళనకారులను కట్టడి చేయడానికి పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. బడి విద్యార్థుల నిరసనల్లో టీచర్లు, ఉద్యోగులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా చేరుతుండటంతో నిరసనోద్యమం మరో మలుపు తిరిగినట్టు స్థానిక మీడియా పేర్కొన్నది. ఆందోళనలకు సంబంధించి ఇప్పటివరకూ 5 వేల మంది అరెస్టయినట్టు వెల్లడించింది. ఆందోళనల్లో 24 స్కూల్స్ తగలబడ్డాయని, జాతీయ విద్యాశాఖకు చెందిన 78 మంది ఉద్యోగులు గాయపడ్డారని విద్యాశాఖ మంత్రి ఎడోర్డ్ జెఫ్రే తెలిపారు. పరిస్థితులను చక్కదిద్ది, శాంతి-భద్రతలను పరిరక్షించడమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు.
తొలుత నిరసనలు అక్కడే
టీచర్ల కొరతను నిరసిస్తూ గత నెల చివరి వారంలో పారిస్ శివారుల్లోని ఓ హైస్కూల్లో ప్రారంభమైన ఈ నిరసనలు ఆ తర్వాత దేశంలోని నగరాలన్నింటికీ విస్తరించాయి. దేశవ్యాప్తంగా మూడు లక్షల మంది ఆందోళనల్లో పాల్గొన్నారని విద్యార్థి సంఘాలు తెలిపాయి. ‘నగర శివార్లకు చెందిన మేము నిర్లక్ష్యానికి, విస్మరణకు గురయ్యాం. ఇక్కడి స్కూల్స్‌లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి’ అని విద్యార్థులు ఆందోళనల్లో ప్లకార్డులు ప్రదర్శించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

