Pneumonic Plague | రష్యాలో ప్లేగు బ్యాక్టీరియా లీక్.. ల్యాబ్ పరిశోధకురాలి మృతి.. క్వారంటైన్లో 200 మంది.?
Pneumonic Plague | సైబీరియాకు చెందిన ఒక ల్యాబొరేటరీ పరిశోధకురాలి మరణం నేపథ్యంలో రష్యా ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఇర్కుట్స్ యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఆమె ‘న్యూమోనిక్ ప్లేగ్' కారణంగా మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
Pneumonic Plague | మాస్కో: సైబీరియాకు చెందిన ఒక ల్యాబొరేటరీ పరిశోధకురాలి మరణం నేపథ్యంలో రష్యా ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఇర్కుట్స్ యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఆమె ‘న్యూమోనిక్ ప్లేగ్’ కారణంగా మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన దాదాపు 200 మందిని క్వారంటైన్లో ఉంచారు. సెలెఖోవ్లో దవాఖానలో చేరడానికి ముందు 28 ఏండ్ల ప్రయోగశాల పరిశోధకురాలు డార్యా షిపిలోవా పనిచేస్తుండగా ప్లేగు వ్యాధి బారిన పడినట్టు సమాచారం.
పరీక్షల కోసం నమూనాలను సేకరిస్తుండగా సజీవ బ్యాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్‌ను ప్రమాదవశాత్తు పగులగొట్టానని ఆమె వైద్య అధికారులకు చెప్పినట్టు పలు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. తీవ్రమైన న్యూమోనియా లక్షణాలతో సెప్టెంబర్ 29న ఆమె దవాఖానలో చేరారు. అక్టోబర్ 1న మరణించే ముందు ఆమెకు వెంటిలేటర్ సహాయం అందించారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన సుమారు 200 మందిలో ప్రస్తుతం వ్యాధి లక్షణాలు ఏవీ కనిపించడం లేదని సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

