బెంగళూరు: ఒక కుటుంబాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. దీని గురించి ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ కోసం ఒక పోలీస్ అధికారి ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే ఆ మహిళ అనుచితంగా ప్రవర్తించింది. చీర విప్పిన ఆమె దీనిని వీడియో రికార్డ్ చేయించింది. (Woman Strips, Misbehaves With Cop) ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నంజన్గూడ్ తాలూకా శిరమల్లి గ్రామంలోని ఒక కుటుంబాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. ఆ కుటుంబానికి చెందిన రత్నమ్మ దీని గురించి మైసూరులో మీడియా ముందు తన బాధను వ్యక్తం చేసింది. అలాగే ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేసింది.
కాగా, ఆగస్ట్ 1న ఫిర్యాదుపై విచారణ కోసం ఒక పోలీస్ అధికారి రత్నమ్మ ఇంటికి వెళ్లారు. అయితే ఇంటి బయట ఉన్న ఆ పోలీస్తో ఆమె దురుసుగా ప్రవర్తించింది. తన మాటలను మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసింది. ఆ తర్వాత రత్నమ్మ అనుచితంగా ప్రవర్తించింది. ఉన్నట్టుండి చీర విప్పింది. మరో మహిళకు తన మొబైల్ ఫోన్ ఇచ్చి రికార్డ్ చేయమని చెప్పింది. ఆ తర్వాత పోలీస్ చెంతకు వెళ్లి నెట్టింది. అయితే పోలీసు అధికారి చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆమె ఇలా ఎందుకు ప్రవర్తించిందో అన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ನಂಜನಗೂಡು: ಮಾಹಿತಿ ಪಡೆಯಲು ಬಂದ ಪೊಲೀಸಪ್ಪನ ಮುಂದೆ ಸೀರೆ ಬಿಚ್ಚಿ ಅನುಚಿತ ವರ್ತನೆ…ವಿಡಿಯೋ ವೈರಲ್…#nanjangud #newskarnataka pic.twitter.com/jBljpWdbNA
— News Karnataka (@Newskarnataka) August 1, 2025
Also Read:
Women, Minors Rescued | మానవ అక్రమ రవాణాదారుల నుంచి.. 24 మంది మహిళలు, ముగ్గురు మైనర్ల రక్షణ
Woman Married 8 Men | 8 మందిని పెళ్లాడి దోచుకున్న మహిళ.. 9వ పెళ్లికి సిద్ధమవుతుండగా అరెస్ట్
Watch: గుడిలో అనధికార హుండీ.. అధికారులు రావడంతో ఎత్తుకెళ్లిన డీఎంకే కార్యకర్త