ముంబై: ఒక మహిళ 8 మందిని పెళ్లాడింది. (Woman Married 8 Men) ఆ భర్తలను బెదిరించి దోచుకున్నది. తాజాగా 9వ పెళ్లి కోసం ఆమె ప్రయత్నిస్తున్నది. మాజీ భర్తల ఫిర్యాదు నేపథ్యంలో ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన సమీరా ఫాతిమా ‘దోపిడీ దుల్హాన్’గా పేరుగాంచింది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో నమోదైన ముస్లిం వర్గానికి చెందిన ధనవంతులు, వివాహిత పురుషులను ఆమె లక్ష్యంగా చేసుకున్నది. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా వారితో పరిచయం పెంచుకున్నది. తన దీన పరిస్థితిని వివరించి వారి సానుభూతి పొందేది.
కాగా, గత 15 ఏళ్లలో సమీరా ఫాతిమా ఎనిమిది మందిని పెళ్లాడింది. ఆ తర్వాత తన ముఠాతో కలిసి వారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బులు దోచుకున్నది. ఒక భర్త నుంచి రూ.50 లక్షలు, మరొకరి నుంచి రూ.15 లక్షలు వసూలు చేసింది. రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన సీనియర్ అధికారి కూడా ఆ మహిళ చేతిలో మోసపోయిన బాధితుల జాబితాలో ఉన్నాడు.
మరోవైపు మోసపోయిన మాజీ భర్తలు సమీరా ఫాతిమాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి గర్భవతిగా పేర్కొంటూ పోలీస్ అరెస్ట్ నుంచి ఆమె తప్పించుకున్నది. తాజాగా 9వ వ్యక్తిని పెళ్లాడేందుకు సమీరా ప్రయత్నిస్తున్నది. అయితే జూలై 29న నాగపూర్‌లోని ఒక టీ షాప్ వద్ద ఆమె ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు వెళ్లి ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఆమెపై అందిన ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Peon gives urine to senior | తాగునీరు అడిగిన సీనియర్ అధికారి.. మూత్రం నింపిన బాటిల్ ఇచ్చిన ప్యూన్
SSC Students Protest | ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహణలో లోపాలు.. విద్యార్థుల నిరసన
Watch: గుడిలో అనధికార హుండీ.. అధికారులు రావడంతో ఎత్తుకెళ్లిన డీఎంకే కార్యకర్త