చెన్నై: ఒక వ్యక్తి గుడిలో అనధికారంగా హుండీ ఏర్పాటు చేశాడు. ఈ సమాచారం తెలిసిన అధికారులు ఆ గుడి వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కానుకలతో నిండిన ఆ హుండీని ఆ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. (DMK Worker Walks Away With Temple Hundi) తమిళనాడులోని పెరంబలూరులో ఈ సంఘటన జరిగింది. కొలత్తూరు ప్రాంతంలోని సుందరమూర్తి అయ్యనార్ ఆలయానికి చెందిన డీఎంకే కార్యకర్త తునైవేందన్ ఒక హుండీని అక్కడ ఏర్పాటు చేశాడు.
కాగా, ఈ సమాచారం తెలిసిన దేవాదాయ శాఖ అధికారులు ఆ ఆలయానికి చేరుకున్నారు. అనధికారంగా ఏర్పాటు చేసిన హుండీని సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే డీఎంకే కార్యకర్త తునైవేందన్ ఆ అధికారులను బెదిరించాడు. అతడు ఏర్పాటు చేసిన కానుకలతో నిండిన ఆ హుండీని అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోయాడు.
మరోవైపు తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకుడు కే అన్నామలై ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై ఆయన ఆగ్రహించారు. ‘డీఎంకే పాలనలో దేవాలయాలు కూడా రాజకీయ దోపిడీ నుంచి తప్పించుకోలేవు. తాము దీనిని ఎత్తి చూపడం ఇదే మొదటిసారి కాదు’ అని విమర్శించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో డీఎంకే కార్యకర్త తీరుపై నెటిజన్లు కూడా మండిపడ్డారు.
DMK functionary Thunaivendhan is caught on video lifting a Hundi from the Sundaramurthy Ayyanar Temple in Kolathur, Perambalur. Ironically, this Hundi wasn’t installed by the HR&CE Department, but by Thunaivendhan himself.
When officials finally acted to seal it, he resorted to… pic.twitter.com/7j0K00diUS
— K.Annamalai (@annamalai_k) August 1, 2025
Also Read:
Peon gives urine to senior | తాగునీరు అడిగిన సీనియర్ అధికారి.. మూత్రం నింపిన బాటిల్ ఇచ్చిన ప్యూన్
SSC Students Protest | ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహణలో లోపాలు.. విద్యార్థుల నిరసన
Watch: రూ.70,000కుపైగా జీతాలు.. 11,18,19ను ఇంగ్లీష్‌లో రాయడంలో ప్రభుత్వ టీచర్లు విఫలం