గౌహతి: మానవ అక్రమ రవాణాదారుల నుంచి 24 మంది మహిళలు, ముగ్గురు మైనర్ బాలికలను పోలీసులు రక్షించారు. (Women, Minors Rescued) ఉద్యోగ నియామకాల పేరుతో నకిలీ పత్రాలతో వారిని రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. అస్సాంలోని టిన్సుకియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. టిన్సుకియా రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) సంయుక్తంగా సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ 1 కోచ్‌లో సుమారు 30 మంది మహిళలు, బాలికలు ఉండటాన్ని గమనించారు. ఉద్యోగ నియామకాల నెపంతో తమిళనాడులోని తిరుప్పూర్‌కు వారిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.
కాగా, కోయంబత్తూరులో ఉన్న రతినం అరుముగన్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అనే ఏజెన్సీకి టిన్సుకియాలో బ్రాంచ్ ఆఫీస్ ఉన్నది. అయితే 27 మందిలో కేవలం ఒక మహిళ వద్ద మాత్రమే ఆ సంస్థకు చెందిన ఉద్యోగ నియామక పత్రం ఉన్నది. మిగతా వారి వద్ద నకిలీ పత్రాలు ఉన్నట్లు గ్రహించారు.
మరోవైపు మిగతా మహిళలను అక్రమ మానవ రవాణాగా పోలీసులు అనుమానించారు. చైల్డ్ హెల్ప్‌లైన్ సహాయంతో 24 మంది మహిళలు, ముగ్గురు మైనర్ బాలికలను రక్షించారు. వారి కుటుంబాలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మానవ అక్రమ రవాణా రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లుగా అనుమానిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Also Read:
Woman Married 8 Men | 8 మందిని పెళ్లాడి దోచుకున్న మహిళ.. 9వ పెళ్లికి సిద్ధమవుతుండగా అరెస్ట్
Peon gives urine to senior | తాగునీరు అడిగిన సీనియర్ అధికారి.. మూత్రం నింపిన బాటిల్ ఇచ్చిన ప్యూన్
Watch: గుడిలో అనధికార హుండీ.. అధికారులు రావడంతో ఎత్తుకెళ్లిన డీఎంకే కార్యకర్త