హైదరాబాద్, మార్చి 5 (నమస్తేతెలంగాణ): విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ సొమ్ముతో హార్వర్డ్ టూర్‌కు వెళ్లారని హరీశ్ విమర్శించారు. గురువారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విద్యాశాఖ ద్వారా విడుదలయ్యే నిధులను విద్యార్థుల అభ్యున్నతి కోసం ఖర్చుచేయకపోవడం శోచనీయమని వాపోయారు. తెలంగాణలో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ బంద్ పెట్టడంతో వారు ఆకలితో అలమటిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం విదేశాల్లో లీడర్షిప్ సమ్మిట్‌కు హాజరుకావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘ఇదేనా సీఎం రేవంత్‌రెడ్డి 2021 లీడర్షిప్?’ అంటూ చురకలంటించారు.