వికారాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని, అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ఈ రెండున్నరేండ్లలో జిల్లా లో ఉత్తుత్తి హామీలు, శిలాఫలకాలే తప్ప ఒక్క పనిని కూడా పూర్తి చేయలేదు. రెండేండ్లపాటు పంచాయతీలను నిర్వీ ర్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మిగ తా రోడ్లు, మార్కెట్ యార్డులు, ప్రభు త్వ భవనాలు, బ్రిడ్జిల అభివృద్ధినీ విస్మరించింది. రెండేండ్ల కిందట స్పీ కర్ ప్రసాద్‌కుమార్‌తోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు జిల్లా కేంద్రంలో నాలుగు సూట్ల గెస్ట్‌హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా..25 నెలలు దాటినా పనులే ప్రారంభంకాలేదు.
అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు కూడా ఎక్కడిక్కడ నిలిచిపోయా యి. రైతుబజార్లో ఎలాంటి వసతులు లేకపోవడంతో కూరగాయలు విక్రయించే రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆలంపల్లి నుంచి గిరిగెట్‌పల్లి రోడ్డు పనులకు మంత్రులు శంకుస్థాపన చేసి ఏడాది దాటినా ఇప్పటివరకు ఆ పనులు షురే కాలే దు. కొంపల్లి-బంట్వారం రోడ్డు నిర్మాణానికి కూ డా శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా పురోగతి నిల్. 32 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి దేవుడెరుగు.. రోడ్లకు పడిన గుంతలను పూడ్చలేని దారుణ స్థితి నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించడంతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పోరుబాట పట్టారు.
ఇప్పటికే రుణమాఫీ, రైతుబంధు, ధాన్యం కొనుగోళ్లు, ప్రభుత్వ వసతిగృహాల్లో సమస్యలపై పోరాడుతున్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ గెస్ట్‌హౌస్ నిర్మాణానికి సంబంధించి శిలాఫలకానికి శంకుస్థాపన చేసి రెండేండ్లు పూర్తైనా నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో శిలాఫలకానికి పూలదండ వేసి, టెంకాయ కొట్టి, కేక్ కట్ చేసి ద్వితీయ వార్షికోత్సవాన్ని నిర్వహించి వినూత్నంగా నిరసన తెలిపారు.
కాంగ్రెస్ హామీలు శిలాఫలకాలకే పరిమితం
వికారాబాద్ జిల్లా కేంద్రంలో నాలుగు సూట్లగెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి బుధవారానికి రెండేండ్లు పూర్తైనా ఇప్పటికీ పనులు షురూ కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో శిలాఫలకాలే తప్పా అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలో గెస్ట్‌హౌస్ నిర్మాణానికి వేసిన శిలాఫలకాన్ని, నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సందర్శించి, వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడాల్సిన నాలుగు సూట్ల గెస్ట్‌హౌస్ నిర్మాణం రెండేండ్లు గడిచినా పూర్తి కాకపోవడం రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు కేవలం శిలాఫలకాలకే పరిమి తం కావద్దని, స్పీకర్ ప్రసాద్‌కుమార్ స్పందించి వెం టనే గెస్ట్‌హౌస్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయించాల ని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వాలు మారినా అభివృద్ధి ఆగేది కాదని కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క అభివృద్ధి జరగడం లేదని, శిలాఫలకాలు వేయడం పనులు మరిచిపోవ డం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలో నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతుబజార్లో రైతులకు తాగునీటి సౌకర్యంతోపాటు మరుగుదొడ్లను నిర్మించాలని.. చెత్తను వెంటనే తొలగించడంతోపాటు మార్కెట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సకాలంలో జీతాలను చెల్లించాలన్నారు.
కాగా, ఇటీవల రేవంత్‌రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులపై క్రిమినల్ వేస్ట్ అంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్‌తోపాటు ఇతర అభివృద్ధి నిర్మాణాలు, మీరు ఉంటున్న ఇండ్లను కట్టిస్తున్నది ఇంజినీ ర్లే కదా.. ఇంజినీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను వెంటనే విరమించుకొని వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా హరీశ్‌రావుపై అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగని విధంగా ఆయ న మాట్లాడుతున్నారని, అద్దంకి మాటలు వింటుంటే చదవుకున్న వ్యక్తి మాట్లాడే భాషలా లేదని ఎద్దేవా చేశారు. నిరసనలో బీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, గోపాల్, దేవదాసు తదితరులు పాల్గొన్నారు.