Stock Market | భారీగా పతనమైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 778 పాయింట్లు నష్టం.. నిఫ్టీ 280 పాయింట్లు లాస్
Stock Market : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 778 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయింది. రూపాయి విలువ వరుసగా ఐదో సెషన్లోనూ బలహీనపడింది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 778 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయింది. ఉదయం స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ప్రారంభమైంది. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు పెరగగా, నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ గరిష్టంగా 75,436.44 పాయింట్లు, కనిష్టంగా 73,994.03 పాయింట్లకు చేరింది.
మొత్తంగా ఒక రోజులో 1,442.41 పాయింట్ల పతనాన్ని నమోదు చేసింది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 777.94 పాయింట్లు (1.04 శాతం) నష్టపోయి 74,003.82 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 279.50 పాయింట్లు (1.19 శాతం) నష్టంతో 23,118.60 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్ కూడా నష్టాల్లోనే ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 468.52 పాయింట్లు (2.50 శాతం) నష్టపోగా, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 226.73 పాయింట్లు (2.47 శాతం) నష్టపోయింది. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ మెటల్ షేర్లు కూడా నష్టపోగా.. నిఫ్టీ ఐటీ షేర్లు మాత్రం భారీగా లాభపడ్డాయి.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, హిందుస్తాన్ యునీలీవర్ షేర్లు లాభాల్లో ముగియగా.. ఇండిగో, అదానీ స్పోర్ట్స్, బీఈఎల్, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 1.30 శాతం పెరిగి 107 డాలర్లకు చేరింది. బంగారం ఔన్స్ ధర 4,273.11 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ వరుసగా ఐదో సెషన్లోనూ బలహీనపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.96గా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

