చౌటుప్పల్, సెప్టెంబర్ 15 : చౌటుప్పల్ మండల పరిధిలోని ఎస్. లింగోటం గ్రామంలో గౌడ కులస్తులు కంఠమహేశ్వర స్వామి బోనాల ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పుచప్పులతో బోనాలను బొడ్రాయి చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయానికి చేరుకుని బోనాల నైవేద్యాన్ని సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా పడి పాడిపంటలు పండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు ఎర్ర జంగయ్య గౌడ్, పెద్ద గౌడ్ పల్సం కాటమయ్య గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్, నాయకలు రాచకొండ నరసింహ గౌడ్, పల్సం దశరథ గౌడ్, బోడిగే ఆనంద్ గౌడ్, గంగాపురం గంగాధర్ గౌడ్, గంగాపురం నరహరి గౌడ్, లోడే వెంకటరమణ గౌడ్, లగ్గొని ఐలయ్య గౌడ్, పల్సం రమేష్ గౌడ్, బాలగోని వెంకటేష్ గౌడ్ లగ్గొని ఐలయ్య గౌడ్, ఎర్ర విక్రమ్ గౌడ్, రాచకొండ ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు.