JAM | జామ్-2027 ద్వారా ఐఐటీల్లో పీజీ, పీహెచ్డీ
JAM | సైన్స్, రీసెర్చ్ రంగాల్లో ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులు ఎదురుచూస్తుంటారు. వారికోసమే జామ్-2027 ప్రకటన విడుదలైంది. దీనిద్వారా ఐఐటీల్లో పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రకటన వివరాలు తెలుసుకుందాం.
JAM | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లలో ఎమ్మెస్సీ, పీహెచ్డీ చేయాలనేది చాలామంది కల. ఆ కలను నెరవేర్చుకునేందకు ఐఐటీ ఖరగ్‌పూర్ అవకాశం కల్పించింది. JAM (జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్) 2027 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఐఐటీ, ఐఐఎస్సీల్లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. 2027-28 విద్యాసంవత్సరానికి 23 ఐఐటీల్లో సుమారు 3000 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ JAM Online Application Processing System (JOAPS) పోర్టల్‌లో ఇప్పటికే ప్రారంభమయ్యింది. అక్టోబర్ 12వ తేదీ వరకు చేసుకోవచ్చు.
కోర్సులు
ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ (Tech), ఎంఎస్ (Researh), ఎమ్మెస్సీ-M Tech Dual Degree, జాయింట్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ, ఎమ్మెస్సీ- Ph.D. Dual Degree కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

Jam Notification
అర్హతలు
ఈ ప్రవేశ పరీక్ష (Entrance Exam) రాయడానికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినవారు లేదా ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు అర్హులు. భారతీయ డిగ్రీ కలిగిన విదేశీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం
పరీక్ష ఏడు సబ్జెక్టులు మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్‌లపై నిర్వహిస్తారు. ఈ సబ్జెక్టుల్లో ప్రతిభ చూపిన ఆధారంగా వాటిలో స్పెషలైజేషన్లతో కోర్సులు ఎంచుకోవచ్చు. అభ్యర్థులు ఒకటి లేదా రెండు సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా నిర్వహిస్తారు. సెషన్-1లో ఒకటి, సెషన్-2లో మరొక సబ్జెక్టులో పరీక్ష రాసుకోవచ్చు. సెషన్-1లో కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో, సెషెన్-2లో బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌లలో పరీక్ష ఉంటుంది.

Apply
దరఖాస్తు ఫీజు
ఒక పేపర్‌కు రూ. 2000, రెండు పేపర్లకు రూ. 2700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఒక పేపర్‌కు రూ. 1000, రెండు పేపర్లకు రూ. 1350. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు సెంటర్లలో ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
చివరితేదీ
ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరితేదీ అక్టోబర్ 12. ఇతర వివరాలకు వెబ్సైట్ https://jam.iitkgp.ac.in చూడండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

