Imran Khan | ఇమ్రాన్‌కు బాసటగా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు.. మానవత్వం చూపాలని విదేశాంగ మంత్రికి లేఖ..!
Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు ఒకప్పటి క్రికెటర్ల మద్దుతు పెరుగుతోంది. తమతో కలిసి ఆడిన ఇమ్రాన్ జైల్లో అనారోగ్యంతో బాధపడుతున్నందున.. అతడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు ఒకప్పటి క్రికెటర్ల మద్దుతు పెరుగుతోంది. తమతో కలిసి ఆడిన ఇమ్రాన్ జైల్లో అనారోగ్యంతో బాధపడుతున్నందున.. అతడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే భారత దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ సహా 22 మంది పాక్ ప్రధానికి లేఖ రాశారు. తాజాగా ఏడుగురు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు వీరితో కలిశారు. జైల్లో మగ్గుతున్న ఇమ్రాన్‌పై మానవత్వం చూపేలా ఒత్తిడి చేయాలని తమ దేశానికి చెందిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పెన్నీ వాంగ్‌ను వీరంతా అభ్యర్థించారు.
మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌కు మెరుగైన వైద్యం కోసం క్రికెట్ దిగ్గజాలు పట్టుపడుతున్నారు. మానవతాకోణంలో ఆలోచించి అతడికి మంచి చికిత్స అందించాలని ఇప్పటికే పలువురు డిమాండ్ చేయగా.. ఏడుగురు ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు తాజాగా లేఖ రాశారు. పాక్ ప్రభుత్వం ఇమ్రాన్‌పై మానవత్వంతో వ్యవహరించేలా చొరవ తీసుకోవాలని ఆసీస్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పెన్నీ వాంగ్‌కు వీరంతా ఉత్తరం పంపారు.
Seven former Australia cricket captains have now approached Australia’s minister for foreign affairs, Penny Wong, to raise humanitarian concerns over Imran Khan’s detention in Pakistan pic.twitter.com/HfodQ3wlRz
— Cricinfo (@cricinfo) September 15, 2026
‘రాజకీయవేత్తలుగా లేదా దౌత్యవేత్తలుగా కాదు.. మాజీ ఆటగాళ్లుగా ఈ అభ్యర్థన చేస్తున్నాం’ అని అలన్ బోర్డర్, స్టీవ్ వా, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, కిమ్ హుగెస్, మార్క్ టేలర్ బృందం పేర్కొంది. ‘ఇమ్రాన్‌పై ఉన్న రాజకీయ, చట్టపరమైన కేసుల గురించి మేం మాట్లాడడం లేదు. వారిమధ్య రాజకీయాలు ఎన్ని ఉన్నా సరే అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యక్తికి మెరుగైన వైద్యం అందించడం కనీస మానవత్వం. ఆ దిశగా పాక్‌పై ఒత్తిడి పెంచేలా మీరు చొరవ తీసుకోండి’ అని పెన్నీ వాంగ్‌ను కోరారు లెజెండరీ కెప్టెన్లు.
Greg Chappell requests Australian government to intervene in Imran Khan’s case#Pakistan #ImranKhanhttps://t.co/nO8koOShUD
— CREX (@Crex_live) September 15, 2026
అవినీతి, దేశ రహస్యాల వెల్లడి, ఇతర చట్టపరమైన నేరాల కింద ఇమ్రాన్ జైలుకు వెళ్లాడు. 2023 ఆగస్టు నుంచి ఆయన జైల్లోనే మగ్గుతున్నాడు. ఇటీవల ఇమ్రాన్ కంటి చూపు కోల్పోయాడు. దాంతో.. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని క్రికెట్ లోకం డిమాండ్ చేస్తోంది. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ సహా 22 మంది.. ఆపై బ్రియాన్ లారా, ప్యాట్ కమిన్స్, వసీం అక్రమ్‌లు సైతం ఇమ్రాన్ గురించి ఆందోళన వ్యక్థం చేశారు. కానీ, ప్రధాని షహ్బాజ్ షరీఫ్, పాక్ ప్రభుత్వం ఆయనపై కనికరం చూపడం లేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

