Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఎల్‌నినో దెయ్యం కాదు.. కాంగ్రెస్ దెయ్యం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
Jagadish Reddy | ఏపీకి నీళ్లు పోతున్నాయని ఇన్నిసార్లు ఆధారాలతో చూపిస్తున్నా కూడా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడం లేదన్నారు. పథకం ప్రకారమే తెలంగాణలో పంటలు పండకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
Jagadish Reddy | నీళ్ల విషయం మాట్లాడితే మంత్రులు మొఖం చాటేస్తున్నారు.. చెప్పిన అబద్దాలే చెబుతూ లేని ఎల్‌నినోను సృష్టించి ఏది అడిగినా ఎల్‌నినో అని మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరెంట్ అడిగినా ఎల్‌నినో.. నీళ్ల గురించి అడిగినా ఎల్‌నినో, సంక్షేమ పథకాల గురించి అడిగినా ఎల్‌నినో,, ఇచ్చిన హామీల గురించి అడిగినా ఎల్‌నినో వచ్చింది.. అదేదో దెయ్యం వచ్చింది.. భూతమొచ్చింది అనే పద్దతుల్లో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఎల్‌నినో దెయ్యం కాదు.. కాంగ్రెస్ దెయ్యం. కాంగ్రెస్ దెయ్యం పట్టింది కాబట్టే తెలంగాణ నాశనం అయితుంది తప్ప ప్రకృతి వల్ల ఏ ఇబ్బంది రాలేదు.. ఎంత ఎల్‌నినో ప్రభావమున్నా గోదావరి, కృష్ణ నదుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ మన కండ్ల ముందే ఏపీకి నీళ్లు పోతున్నయి. కన్నెపల్లి పంప్‌హౌస్ ఇవాళ ప్రారంభం చేసినా నీళ్లు సిద్దంగా ఉన్నాయన్నారు. ఒకవైపు కాళేశ్వరం జలాలు ఇవ్వకుండా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రాంతాలను అటు ఆలేరు, బోనగిరి ప్రాంతాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకోవైపు సాగర్‌లోకి నీళ్లొచ్చి కూడా ఎస్ఎల్బీసీ కావొచ్చు.. లో లెవల్ కెనాల్ కావొచ్చు.. సాగర్ ఎడమ కాలువ కిందున్న రైతాంగాన్ని అయోమయంలో పడేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీకి నీళ్లు పోతున్నాయని ఇన్నిసార్లు ఆధారాలతో చూపిస్తున్నా కూడా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడం లేదన్నారు. పథకం ప్రకారమే తెలంగాణలో పంటలు పండకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఎల్ నినో దయ్యం కాదు కాంగ్రెస్ దయ్యం
కాంగ్రెస్ దయ్యం పట్టడం వల్లే తెలంగాణ నాశనం అవుతుంది
నల్గొండకు నీళ్ల విషయం మాట్లాడితే మంత్రులు మొహం చాటేస్తున్నారు
ఏది అడిగినా ఎల్ నినో ప్రభావం వల్ల అని చెబుతున్నారు
ఎల్ నినో ఉన్నప్పటికీ గోదావరి, కృష్ణ నదుల్లో… pic.twitter.com/FJB2TjTG8n
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2026
Read Also :
Uttar Pradesh | యూపీలో కారు అదుపుతప్పి ముగ్గురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
KA Paul | యుద్ధాలు 58, ప్రభావం 850 కోట్ల మందిపై.. ఆవేదన వ్యక్తంచేసిన కేఏ పాల్
హయత్‌నగర్ పరిధిలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

