– తుంగతుర్తిలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
తుంగతుర్తి, సెప్టెంబర్ 15 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేవెళ్లలో ప్రకటించిన గిరిజన డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ గిరిజన నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ గిరిజనులకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా విస్మరించిందని విమర్శించారు. గిరిజన విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు ఇవ్వాలన్నారు. గిరిజనుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు.