– పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం
కేతేపల్లి, సెప్టెంబర్ 15 : కేతేపల్లి మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్ హాల్ లో మండలానికి సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు, సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.