తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’ (Mandadi) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో టాలెంటెడ్ డైరెక్టర్ మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ చిత్రం, విడుదలై కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. బోట్ రేసింగ్ నేపథ్యంతో సాగే వినూత్న కథాంశం, అద్భుతమైన యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకులను థ్రియేటర్లకు క్యూ కట్టేలా చేస్తున్నాయి.
అయితే ఈ సినిమా కమర్షియల్ విజయంతో పాటు, దీని డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రూ.45 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే, ఈ డీల్ వెనుక ఒక ఆసక్తికరమైన బాక్సాఫీస్ లింక్ ఒప్పందం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట నిర్మాత ఎల్రెడ్ కుమార్ రూ.25 కోట్లు డిమాండ్ చేయగా, నెట్‌ఫ్లిక్స్ రూ.15 కోట్లు మాత్రమే ఇవ్వడానికి ముందుకొచ్చింది.
దీంతో ఇరువర్గాల మధ్య ఒక వినూత్న షరతుతో కూడిన ఒప్పందం కుదిరింది. సినిమా వసూళ్ల ఆధారంగా పారితోషికం పెరిగేలా ప్లాన్ చేశారు. బాక్సాఫీస్ వద్ద సినిమా రూ.50 కోట్లు దాటితే రూ.30 కోట్లు, అలాగే రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్ల మధ్య వసూలు చేస్తే ఏకంగా రూ.40 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ.65 కోట్ల మార్క్‌ను అందుకోవడంతో, నెట్‌ఫ్లిక్స్ రూ.40 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్టిన బడ్జెట్లో సగానికి పైగా కేవలం ఓటీటీ హక్కుల ద్వారానే వెనక్కి వస్తుండటంతో నిర్మాతకు ఇది అసలు సిసలు జాక్‌పాట్ అని చెప్పవచ్చు. ఇదే జోరు కొనసాగితే ‘మండాడి’ త్వరలోనే వంద కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
BuzzFeed: 65+ CRORES Worldwide! Soori Anna Mass Storm! 💥 MANDADI Roaring in Theatres!
*Caption & Hashtag ready:*
> Mudhuguvellai Gangs on Fire 🔥
> Soori Anna Vera Maari Sambavam!
> 65+ Crores & Still Counting!#Maaman #Mandadi #Soori #65Crores #KollywoodBlockbuster pic.twitter.com/wMlgWmmZBQ— Sakthivel (@ImSakthivel2000) September 15, 2026