నంద్యాల : ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం (Srisailam Temple) మల్లికార్జునస్వామి సన్నిధిలో అగ్నిప్రమాదం( Fire Incident ) చోటు చేసుకుంది. వీఐపీ కాటేజీ ( VIP Cottage ) లో జరిగిన ఈ ఘటనలో భక్తులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఆదివారం అర్ధరాత్రి ఆలయ అబ్బూరు వీఐపీ కాటేజీలోని మొదటి అంతస్తులో షార్ట్‌సర్క్యూట్‌తో ఏసీ పేలి మంటలు చెలరేగాయి. గమనించిన 12 మంది భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.