PM Modi : దేశంలో పరీక్షల నిర్వహణ కోసం హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని అధ్యక్షతన ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మోదీ తన సోషల్ మీడియా ఖాతాల్లో వీడియో ద్వారా ప్రకటించారు.
మన భవిష్యత్ గురించి దృష్టిసారించాలి. మన పరీక్షల నిర్వహణ వ్యవస్థ పారదర్శకంగా, విశ్వసనీయంగా మారాలి. ఇందుకోసం సాంకేతికతను అత్యున్నతంగా వినియోగించుకోవాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సాంకేతికరంగంలో నిపుణులు నందన్ నీలేకని ఆధ్వర్యంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షల్లో సంస్కరణలపై ఈ టాస్క్‌ఫోర్స్ దృష్టి పెడుతుంది. ఈ టాస్క్‌ఫోర్స్ అందించే నివేదిక ఆధారంగా పరీక్షల నిర్వహణపై త్వరితగతిన చర్యలు తీసుకుంటాం అని మోదీ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీజేపీ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడం, విద్యార్తులు, యువతపై ప్రభుత్వ బలగాల లాఠీఛార్జ్‌తో దేశమంతా కదిలింది.
HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5
— Narendra Modi (@narendramodi) July 26, 2026
రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. సీజేపీ నేతలతో చర్చలు జరిపింది. సీజేపీ కోరినట్లుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ కూడా ఈ అంశంపై స్పందిస్తూ ఏకంగా మూడు వీడియోలు విడుదల చేశారు. నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో దేశంలో పరీక్షల నిర్వహణలో సంస్కరణలు రాబోతున్నాయి. పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు, శిక్షలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.