Boyapati Srinu | మాస్ అండ్ లార్జర్ దన్ లైఫ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి వార్తల్లో నిలిచారు. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన సినిమాలు ఎప్పుడూ భారీ అంచనాలతో వస్తుంటాయి. ఇటీవల అఖండ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోయపాటి, ఈసారి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాలయ్య – బోయపాటి కాంబోలో మొదటిసారి ఓ సినిమా ప్లాప్ కావడం చర్చనీయాంశమైంది.
అయితే ఈ ఫలితం బోయపాటి మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదన్నది ఇండస్ట్రీ టాక్. వరుసగా పలువురు నిర్మాతలు ఆయనతో సినిమా చేసేందుకు ముందుకొస్తున్నారట. అడ్వాన్స్‌లు ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉన్నారని సమాచారం. హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నప్పటికీ, బోయపాటి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇవ్వలేదట. తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో గాలి కిరీటి పేరు బోయపాటి తదుపరి ప్రాజెక్ట్ విషయంలో వినిపిస్తోంది. ఇటీవల మంచి విజయాన్ని అందుకున్న కిరీటి, తన రెండో సినిమా కోసం బోయపాటిని సంప్రదించాడని వార్తలు వస్తున్నాయి. ఈ భేటీలో బోయపాటి నుంచి కూడా పాజిటివ్ స్పందన వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మాస్ ఇమేజ్ కలిగిన దర్శకుడు, యంగ్ హీరో కలయికలో సినిమా వస్తే అది ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.మరి బోయపాటి – గాలి కిరీటి కాంబో నిజమవుతుందా? ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా? అన్నది చూడాలి.