భువనేశ్వర్: ఇంట్లో నిద్రిస్తున్న ఒక మహిళను పాము కాటేసింది. తల్లికి చికిత్స కోసం కూతురైన బాలిక ఎంతో ప్రయత్నించింది. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో తల్లిని వీపుపై ఐదు కిలోమీటర్లు మోసింది. (Girl Carries Snake Bitten Mother) అయితే సకాలంలో చికిత్స అందకపోవడంతో ఆ బాలిక తన తల్లిని బతికించుకోలేకపోయింది. బీజేపీ పాలిత ఒడిశాలో ఈ విషాద సంఘటన జరిగింది. కంధమాల్ జిల్లాలోని మారుమూల డుమెరిపడ గ్రామానికి చెందిన బలమదు మాఝి శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రించగా పాము కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు.
కాగా, డుమెరిపడ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో ఆ గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు అంబులెన్స్ చేరుకున్నది. ఈ నేపథ్యంలో కుమార్తె అయిన బాలిక రజని తల్లిని వీపుపై ఐదు కిలోమీటర్లు మోసింది. బంధువులతో కలిసి అటవీ మార్గంలో నడిచింది. అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు బైక్పై తల్లితో ప్రయాణించి అంబులెన్స్ ఉన్న సారముండికి చేరుకున్నది.
మరోవైపు పాము కాటేసిన బలమదును తొలుత తుముడిబంద్ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బలిగూడ సబ్ డివిజనల్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అయితే వైద్యం అందడంలో ఆలస్యం వల్ల ఆ మహిళ మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోస్ట్మార్టం తర్వాత తల్లి మృతదేహాన్ని మంచంపై తమ గ్రామానికి ఆమె పిల్లలు మోసుకెళ్లారు.
కాగా, సకాలంలో చికిత్స అందక గతంలో తండ్రిని, తాజాగా తల్లిని ఆ పిల్లలు కోల్పోయారు. దీంతో మారుమూల డుమెరిపడ గిరిజన గ్రామంలో విషాద వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో గ్రామానికి సరైన రోడ్డు మార్గం, మౌలిక సదుపాయాలు సమకూర్చని ప్రభుత్వంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ରାସ୍ତା ନଥିବାରୁ ଜୀବନ ଗଲା। ତୁମୁଡିବନ୍ଧ ବ୍ଲକ ମୁଣ୍ଡିଗୁଡା ପଞ୍ଚାୟତର ଘଟଣା। ସାପ କାମୁଡି ଦେଇଥିବା ଗୁରୁତର ମାଆଙ୍କୁ ନିଜ ପିଠିରେ ୫ କିଲୋମିଟର ବୋହିନେଲା ଝିଅ। ସେଠାରୁ ବାଇକରେ ପୁଣି ୩ କିଲୋମିଟର ନେଲା ପରେ ଆମ୍ବୁଲାନ୍ସରେ ହସ୍ପିଟାଲ ଗଲେ। ପହଞ୍ଚିଲା ବେଳକୁ ବହୁତ ଡେରି ହେଇସାରିଥିଲା। ଖଟିଆରେ ମୃତଦେହ ନେଇ ଫେରିଲେ। #odisha… pic.twitter.com/PtT9aV5cyh
— Odisha Reporter (@OdishaReporter) August 2, 2025
Also Read:
Peon gives urine to senior | తాగునీరు అడిగిన సీనియర్ అధికారి.. మూత్రం నింపిన బాటిల్ ఇచ్చిన ప్యూన్
Watch: మహిళ ఇంటికి వెళ్లిన పోలీస్ అధికారి.. ఆమె ఏం చేసిందంటే?
Watch: గుడిలో అనధికార హుండీ.. అధికారులు రావడంతో ఎత్తుకెళ్లిన డీఎంకే కార్యకర్త