CRPF jawan shot dead | కన్వర్ యాత్రలో ఘర్షణ.. సీఆర్పీఎఫ్ జవాన్‌పై కాల్పులు జరిపి హత్య
CRPF jawan shot dead | కన్వర్ యాత్రకు వెళ్లిన సొంత గ్రామానికి చెందిన వ్యక్తులు, సీఆర్పీఎఫ్ జవాన్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో సెలవుపై గ్రామానికి వచ్చిన ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
చండీగఢ్: కన్వర్ యాత్రకు వెళ్లిన సొంత గ్రామానికి చెందిన వ్యక్తులు, సీఆర్పీఎఫ్ జవాన్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో సెలవుపై గ్రామానికి వచ్చిన ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు. (CRPF jawan shot dead) ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖేరి దమ్కన్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల కృష్ణన్ కుమార్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో అతడు విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజుల కిందట సొంత గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కన్వర్ యాత్ర కోసం హరిద్వార్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ జవాన్ కృష్ణన్, వారి మధ్య ఘర్షణ జరిగింది.
కాగా, ఈ గొడవ తర్వాత కృష్ణన్ సెలవుపై తన గ్రామానికి వచ్చాడు. జూలై 28న తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న అతడిపై కారులో వచ్చిన కొందరు వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు సీఆర్పీఎఫ్ జవాన్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్వర్ యాత్ర కోసం హరిద్వార్ వెళ్లి కృష్ణన్‌తో గొడవ పడిన గ్రామానికి చెందిన వ్యక్తులు అతడ్ని చంపినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. కారు డ్రైవర్ సాగర్, ప్రవీణ్ అలియాస్ మెంధక్, మోహిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితులు నిషాంత్, అజయ్ పరారీలో ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. సీఆర్పీఎఫ్ జవాన్ కృష్ణన్‌తోపాటు ఆనంద్ అలియాస్ పహియా అనే మరో వ్యక్తిని కూడా కాల్చి చంపేందుకు నిందితులు ప్లాన్ వేసినట్లు వెల్లడించారు.
Also Read:
Girl Carries Snake Bitten Mother | పాము కాటేసిన తల్లిని.. వీపుపై ఐదు కిలోమీటర్లు మోసిన బాలిక
Watch: సడన్ బ్రేక్ వేసిన బస్సు డ్రైవర్.. రోడ్డుపై పడిన తల్లి చేతిలోని బిడ్డ
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Brawl
- CRPF jawan
- Days After
- haryana
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

