ఢిల్లీ మేళాలో తెలంగాణ ఉత్పత్తులకు ఆదరణ
తెలంగాణ చేనేత, హస్తకళలు, సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు దేశ రాజధాని ఢిల్లీలో ఆదరణ లభిస్తున్నది. భారత్ మండపంలో నిర్వహిస్తున్న 45వ భారత అంతర్జాతీయ వాణిజ్య మేళా (ఐఐటీఎఫ్)లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు వేదికగా నిలుస్తున్నది.
- చేనేత, హస్తకళలు, చిరుధాన్య ఉత్పత్తులపై సందర్శకుల ఆసక్తి
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చేనేత, హస్తకళలు, సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు దేశ రాజధాని ఢిల్లీలో ఆదరణ లభిస్తున్నది. భారత్ మండపంలో నిర్వహిస్తున్న 45వ భారత అంతర్జాతీయ వాణిజ్య మేళా (ఐఐటీఎఫ్)లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు వేదికగా నిలుస్తున్నది. పోచంపల్లి, ఇకత్, గద్వాల, నారాయణపేట చీరలు, వరంగల్ చేనేత తివాచీలు, హైదరాబాద్ ముత్యాలు, లక గాజులు, కలంకారీ ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
సంప్రదాయ ఇకత్ వస్త్రాలతో రూపొందించిన ఆధునిక బ్యాగులు, దేవరకొండ గిరిజన ఆభరణాలు, ఆదిలాబాద్ సేంద్రియ అగరుబత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సెర్ప్ ఎంపిక చేసిన స్టాళ్లలో ఇప్పపూల (మహువా) లడ్డూలు, చిరుధాన్యాల బిసెట్లు, ఇతర సేంద్రియ ఆహార ఉత్పత్తులకు ఆదరణ లభిస్తున్నది. ‘వికాస్ ఔర్ విరాసత్’ ఇతివృత్తంతో జరుగుతున్న ఈ మేళాలో 11 దేశాలు, 3,500 మందికిపైగా ప్రదర్శకులు పాల్గొంటున్నారు. ఈ నెల 27 వరకు ఈ ప్రదర్శన కొనసాగనున్నది. రాష్ట్ర వాణిజ్య, ఎగుమతి ప్రోత్సాహక విభాగం ఆయా ఉత్పత్తుల ప్రదర్శనకు ఏర్పాట్లు చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

