న్యూఢిల్లీ: పరిమితికి మించి అదనపు లగేజీని విమానంలోకి తీసుకెళ్లేందుకు ఆర్మీ అధికారి ప్రయత్నించాడు. స్పైస్ జెట్ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆర్మీ అధికారి హింసాత్మకంగా ప్రవర్తించాడు. నలుగురు స్పైస్ జెట్ సిబ్బందిని దారుణంగా కొట్టాడు. (Army Officer Thrashes SpiceJet Staff) ఒక ఉద్యోగి నేలపై స్పృహ కోల్పోయినప్పటికీ కొట్టడం ఆపలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జూలై 26న శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్లే స్పైస్ జెట్ విమానంలోకి ఎక్కేందుకు ఆర్మీ అధికారి ప్రయత్నించాడు. ఆయన వద్ద 16 కిలోల బరువున్న రెండు క్యాబిన్ బ్యాగులున్నాయి.
కాగా, ఏడు కిలోల పరిమితి కంటే రెట్టింపు లగేజీ ఉండటంతో అదనపు లగేజీకి చార్జ్ చెల్లించాలని స్పైస్ జెట్ సిబ్బంది కోరారు. ఆ ఆర్మీ అధికారి దీనికి నిరాకరించాడు. అలాగే భద్రతా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించాడు. బోర్డింగ్ ప్రక్రియ పూర్తి చేయకుండా ఏరోబ్రిడ్జిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ ఆర్మీ అధికారిని గేట్ వద్దకు పంపారు.
మరోవైపు గేట్ వద్దకు చేరుకున్న ఆర్మీ అధికారి హింసాత్మకంగా ప్రవర్తించాడు. అక్కడున్న క్యూ స్టాండ్‌తో స్పైస్ జెట్ గ్రౌండ్ స్టాఫ్‌పై దాడి చేశాడు. ఒక ఉద్యోగి నేలపై స్పృహ కోల్పోయినప్పటికీ కొట్టడం ఆపలేదు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు స్పైస్ జెట్ సిబ్బందిపైనా ఆర్మీ అధికారి దాడి చేశాడు. ఈ దాడిలో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని, ఒకరికి వెన్నెముక విరిగిందని స్పైస్ జెట్ తెలిపింది. చివరకు ఆ ఆర్మీ అధికారిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిలువరించారని పేర్కొంది.
కాగా, ఈ సంఘటనపై పోలీసులకు స్పైస్ జెట్ ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఆర్మీ అధికారిపై హత్యాయత్నంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆర్మీ కూడా ఈ సంఘటనపై స్పందించింది. దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తామని వెల్లడించింది. మరోవైపు స్పైస్ జెట్ సిబ్బందిపై ఆర్మీ అధికారి హింసాత్మకంగా దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Spicejet says the man in orange (an Army officer) has been booked for this “murderous assault” on its staff at Srinagar airport over payment for excess cabin baggage. Airline says spinal fracture and broken jaw among the injuries. Probe underway. pic.twitter.com/g2QmIPU7eJ
— Shiv Aroor (@ShivAroor) August 3, 2025
Also Read:
Man Stabs Pregnant Wife | గర్భవతి అయిన భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?
Peon gives urine to senior | తాగునీరు అడిగిన సీనియర్ అధికారి.. మూత్రం నింపిన బాటిల్ ఇచ్చిన ప్యూన్
Watch: మహిళ ఇంటికి వెళ్లిన పోలీస్ అధికారి.. ఆమె ఏం చేసిందంటే?
Watch: సడన్ బ్రేక్ వేసిన బస్సు డ్రైవర్.. రోడ్డుపై పడిన తల్లి చేతిలోని బిడ్డ