Tirumalagiri | నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపాలిటీలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. అర్దరాత్రి మున్సిపల్ సిబ్బంది సహాయంతో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించారు.
పోలీసులు, మున్సిపల్ సిబ్బంది తీరుపై బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేయడం తట్టుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు.. పోలీసులు, మున్సిపల్ సిబ్బందిని అడ్డంపెట్టుకుని ఈ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో బీఆర్ఎస్ నాయకులతో ఎస్సై దురుసుగా ప్రవర్తించారు. వారిని దుర్భాషలాడారు.