Vishwanath And Sons | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా, ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. సూర్య కెరీర్లో 46వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో సూర్య కళ్లద్దాలు ధరించి ఓ చిన్నారిని ఎత్తుకుని కనిపిస్తున్నారు. సింపుల్ కానీ ఎమోషనల్ టచ్‌తో ఉన్న ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సూర్యలో కనిపిస్తున్న పరిపక్వత, బాధ్యతాయుతమైన తండ్రి పాత్ర ఛాయలు పోస్టర్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది.
ఈ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. కీలక పాత్రల్లో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్, భవాని స్రే, బిజోర్న్ సర్రావు కనిపించనున్నారు. విభిన్నమైన భావోద్వేగాలు, కుటుంబ నేపథ్యంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపిన కథగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతాన్ని జీవీ ప్రకాశ్ కుమార్ అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ విలువలు భారీ స్థాయిలో ఉండనున్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాన్ని జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సూర్య – వెంకీ అట్లూరి కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం రానున్న రోజులలో మరిన్ని అప్డేట్స్తో ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించనుంది.