KTR | మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ సర్కార్ పేదల ఇళ్లను కూల్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల ఇళ్లను కూల్చకుండా కూడా అభివృద్ధి చేయడం సాధ్యమేనని ఆయన తెలిపారు.
పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క ఇటుక కదుపకుండా కేసీఆర్ మూసీ సుందరీకరణ చేసి చూపించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం రూ.6 కోట్లతోనే నాగోలు నుంచి ఉప్పల్ భగాయత్ వరకు మూసీని సుందరీకరించి మాడల్‌గా చూపించామని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లను ధ్వంసం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజలను ఇళ్ల నుంచి వెళ్లగొట్టకుండా, వారి జీవనోపాధికి భంగం కలగకుండా కూడా నగరాభివృద్ధి సాధ్యమని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిరూపించిందన్నారు. అదే విధానాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోతుందో సమాధానం చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.
Development can happen without destroying peoples homes
That’s what KCR Govt had demonstrated on a 4 KM stretch at Musi between Nagole and Uppal Bhagayat
Not one home razed and minimum investment of ₹6 Cr
Why can’t the Congress Govt do the same? pic.twitter.com/9G9dIic4Df
— KTR (@KTRBRS) March 2, 2026