లక్నో: పోలీస్ అధికారి ఇంట్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో చేసేదేమీ లేక ఆ నీటిలో పవిత్ర స్నానమాచరించారు. అలాగే పూజలు చేసి గంగా హారతి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (cop performs ‘Ganga aarti’ at doorstep) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. భారీ వర్షాలకు ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమున నదులు పొంగి ప్రవహించాయి. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. పలు ఇళ్లను వరద నీరు ముంచెత్తింది.
కాగా, సబ్ ఇన్స్పెక్టర్ చంద్రదీప్ నిషాద్ ఇంట్లోకి కూడా వరద నీరు ప్రవేశించింది. దీంతో ఆయన వినూత్నంగా స్పందించారు. తన ఇంటి వద్దకు వచ్చిన గంగా ప్రవాహానికి పూలు, పాలు అర్పించి పూజలు చేశారు. ఆ తర్వాత నడుం లోతున ఇంట్లోకి చేరిన నీటిలో పవిత్ర స్నానమాచరించారు. అలాగే గంగా హారతి ఇచ్చారు.
మరోవైపు పోలీస్ అధికారి చంద్రదీప్ నిషాద్ ఈ వీడియో క్లిప్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొంతమంది ఆయన భక్తిని ప్రశంసించగా, మరికొందరు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ఈ గంగా తల్లి ఒక పేద వ్యక్తి ఇంటికి వస్తే మొత్తం ఇంటిని నాశనం చేస్తుంది. ఇది చాలా బాధాకరం’ అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఇలాంటి నిస్సహాయత, అవినీతితో జీవించడాన్ని మన భారతీయులు నేర్చుకుంటారు. రాబోయే 5,000 సంవత్సరాలలో కూడా పరిస్థితి ఏమీ మారదు’ అని మరొకరు విమర్శించారు.
जब बाढ़ आई तो लोग भगवान को दोष देने लगे,
लेकिन यूपी पुलिस के दारोगा चंद्रजीत निषाद ने कुछ और ही किया।जब उनके दरवाजे पर माँ गंगा पहुंचीं,
तो उन्होंने फूल चढ़ाए, जल अर्पित किया और कहा
“हे माँ, तू मेरे घर आई,
मैं इसे परेशानी नहीं, आशीर्वाद मानता हूँ।
मैं धन्य हो गया।” pic.twitter.com/sPYGiUycry— Priya Sinha🇮🇳 (@iPriyaSinha) August 2, 2025
A viral video from #Prayagraj shows #UPPolice officer #ChandradeepNishad performing puja to Maa #Ganga outside his waterlogged house, as floodwaters from #Ganga and #Yamuna enter residential areas pic.twitter.com/Pk8zJ8UEtN
— India Today NE (@IndiaTodayNE) August 2, 2025
Also Read:
Watch: మహిళ ఇంటికి వెళ్లిన పోలీస్ అధికారి.. ఆమె ఏం చేసిందంటే?
Watch: అదనపు లగేజీపై వివాదం.. స్పైస్ జెట్ సిబ్బందిపై ఆర్మీ అధికారి దాడి
Watch: సడన్ బ్రేక్ వేసిన బస్సు డ్రైవర్.. రోడ్డుపై పడిన తల్లి చేతిలోని బిడ్డ