టెల్ అవివ్: ఇరాన్‌కు చెందిన యాక్-130 యుద్ధ విమానాన్ని బుధవారం ఇజ్రాయెల్ వైమానిక దళం కూల్చివేసింది. ఎఫ్-35 ఫైటర్ జెట్‌తో ఇరాన్ జెట్‌ను కూల్చిన ఘటనకు చెందిన వీడియోను ఇవాళ ఐడీఎఫ్(IDF) రిలీజ్ చేసింది. ఎఫ్-35 యుద్ధ విమానం.. మరో మానవసహిత యుద్ధ విమానాన్ని కూల్చడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే గడిచిన 40 ఏళ్లలో తొలిసారి ఇజ్రాయెల్ వైమానిక దళాలు మానవసహిత ఎయిర్-టు ఎయిర్- కంబాట్‌లో పాల్గొన్నాయి. 1985 నవంబర్ 24వ తేదీన చివరిసారి ఇజ్రాయెల్ వైమానిక దళం లెబనాన్ గగనతలంలో శత్రు విమానాన్ని కూల్చివేసింది. ఆ సమయంలో సిరియాకు చెందిన మిగ్-23 ఫైటర్ విమానాలను ఐఏఎఫ్ ఎఫ్-15 నేలకూల్చింది. ఐడీఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెరిన్ మాట్లాడుతూ.. ఇరాన్ విమానం టెహ్రాన్‌లోని మెహారబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్నట్లు తెలిపారు. అయితే టార్గెట్‌ను కూల్చేవామని, ఫైరింగ్ కొనసాగిస్తున్నామని పైలెట్ మాట్లాడుతున్నట్లుగా వీడియోలో ఉన్నది.
“ביצעתי, המטרה נפלה, נמשיך לתקיפה”: תיעוד ראשון ממטוס ה״אדיר״ (F-35I) מפיל מטוס קרב איראני (YAK-130) מעל שמי טהרן.
חיל-האוויר ממשיך לתקוף עשרות תשתיות של משטר הטרור האיראני וסולל את הדרך ליצירת עליונות אווירית בשמי טהרן. pic.twitter.com/RGUX4x1bFK
— Israeli Air Force (@IAFsite) March 5, 2026