హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు (Inter Exams ) ప్రశాంతంగా జరుగుతున్నాయి . గురువారం ఇంటర్ మొదటి సంవత్సరం జ్యూలజీ , హిస్టరీ పరీక్షలు జరిగాయి . ఈ పరీక్షలో 5 గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ ( Malpractice) చేస్తూ పట్టుబడ్డారు.
పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున పట్టుబడ్డారని అధికారులు వివరించారు. గురువారం నాటి పరీక్షలో మొత్తం 4,29,600 మంది విద్యార్థులకు గాను 4,17,656 మంది హాజరయ్యారు. 11,944 మంది గైర్హాజరయ్యారని పరీక్షల అధికారులు వివరించారు.