న్యూఢిల్లీ: ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. (Woman, Boyfriend Kill Husband) మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఆ తర్వాత భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఏడాది తర్వాత అసలు విషయం బయటపడింది. దేశ రాజధాని ఢిల్లీలోని అలీపూర్‌లో నివసించే 42 ఏళ్ల ప్రీతమ్ ప్రకాష్ నేరస్తుడు. అతడిపై పదికి పైగా కేసులు నమోదయ్యాయి. 34 ఏళ్ల సోనియాను 20 సంవత్సరాల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. 16 ఏళ్ల కుమారుడితోపాటు ఇద్దరు కుమార్తెలు వారికి ఉన్నారు.
కాగా, నాలుగు కేసుల్లో నేరస్తుడు, క్యాబ్ డ్రైవర్ అయిన 28 ఏళ్ల రోహిత్‌తో సోనియాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భర్త వేధింపులు, అతడి నేర ప్రవర్తన భరించలేక హత్య చేయాలని వారిద్దరూ ప్లాన్ వేశారు. 2024 జూలై 5న హర్యానాలోని సోనిపట్‌లో సోదరి ఇంట్లో ఉన్న సోనియాను ఢిల్లీకి తెచ్చేందుకు ప్రీతమ్ అక్కడకు వెళ్లాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య గొడవ జరుగడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో తన భర్తను హత్య చేయాలని సోదరి మరిది విజయ్‌కు రూ.50,000 ఇచ్చింది.
మరోవైపు కొంతసేపటి తర్వాత ప్రీతమ్ మళ్లీ అక్కడకు వచ్చాడు. తనతో రావాలని భార్యను బతిమాలాడు. దీంతో సోదరి ఇంట్లో ఉండమని చెప్పింది. ఆ రాత్రి టెర్రస్‌పై సోనియా నిద్రించింది. ఇంట్లో నిద్రించిన ప్రీతమ్‌ను విజయ్ హత్య చేశాడు. సమీపంలోని కాలువలో మృతదేహాన్ని పడేశాడు. ఈ వీడియోను సోనియాకు పంపాడు. ఆ తర్వాత దానిని డిలీట్ చేశాడు.
కాగా, ప్రీతమ్ హత్య తర్వాత సోనియా ఢిల్లీ చేరుకున్నది. 2024 జూలై 20న భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అతడి గురించి ఏమీ తెలియలేదు. కొన్ని రోజుల తర్వాత ప్రీతమ్ ఆటోను రూ.4.5 లక్షలకు సోనియా అమ్మేసింది. అలాగే భర్త మొబైల్ ఫోన్‌ను ప్రియుడు రోహిత్‌కు ఇచ్చింది. అయితే కొంతకాలం పాటు అతడు దానిని వినియోగించలేదు.
మరోవైపు కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని హర్యానా పోలీసులు గుర్తించారు. అయితే అది ఎవరితో అన్నది తెలియలేదు. ఇటీవల ప్రీతమ్ మొబైల్ ఫోన్‌ను సోనిపట్‌లో వినియోగిస్తున్నట్లు తాజాగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. దీంతో ట్రేస్ చేసి రోహిత్‌ను అరెస్ట్ చేశారు.
కాగా, తనతో వివాహేతర సంబంధం వల్ల భర్త ప్రీతమ్‌ను సోనియా హత్య చేయించిందని రోహిత్ తెలిపాడు. దీని కోసం విజయ్‌కు ఆమె డబ్బులు ఇచ్చిందని చెప్పాడు. దీంతో సోనియాను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న విజయ్ కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. హత్య జరిగిన ఏడాది తర్వాత ఈ కేసును చేధించినట్లు వెల్లడించారు.
Also Read:
Woman Murder’s Husband | కుమార్తె, ఇద్దరు అబ్బాయిలతో కలిసి.. భర్తను హత్య చేసిన భార్య
Boy Dies By Suicide | వీడియో గేమ్స్‌కు బానిసైన బాలుడు.. ఆత్మహత్యకు పాల్పడి మృతి
Watch: పోలీస్ అధికారి ఇంట్లోకి వరద నీరు.. ఆయన ఏం చేశారంటే?