హైదారాబాద్ : రెక్కలు ముక్కలు చేసుకొని పైసాపైసా కూడబెట్టుకొని కష్టార్జితంతో కట్టుకున్న గూడును కర్కశంగా కాంగ్రెస ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేసింది. ఇంటిల్లిపాదినీ నడిరోడ్డు మీదకు తెచ్చారు. చిన్నారుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశారు. గుక్కెడు మంచినీళ్లూ ఇచ్చే దిక్కు లేదు. బుక్కెడు బువ్వ పెట్టే నాథుడు లేడు. ఇదీ ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివసిస్తున్న నిరుపేదలపై చూపిస్తున్న కాంగ్రెస్ నిర్వాకం. కండ్లముందే ఉన్న కాస్త గూడు కూడా లేకుండా పోవడంతో నిరేపేదలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వ తీరుపై శాపనార్దాలు పెడుతున్నారు.
మమ్మల్ని మోసం చేసి, మా ఇండ్లు కూల్చిన వారు పురుగులు పడి చస్తారు. వారం రోజుల కింద కంటి ఆపరేషన్ చేయించుకున్న.. ఇప్పుడు ఏడిపిస్తున్నారంటూ ఓ వృద్ధురాలు భోరుమన్నది. మా ఉసురు తగులుతుందన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మమ్మల్ని మోసం చేసి, మా ఇండ్లు కూల్చిన వారు పురుగులు పడి చస్తారు
ఖమ్మం వెలుగుమట్లలో కష్టపడి కట్టుకున్న ఇల్లును అధికారులు కూల్చేయడంతో కన్నీళ్ళు పెట్టుకున్న వృద్ధ బాధితురాలు
వారం రోజుల కింద కంటి ఆపరేషన్ చేయించుకున్న.. ఇప్పుడు ఏడిపిస్తున్నారంటూ ఆవేదన https://t.co/0t5nl2zSNk pic.twitter.com/iXTXYAGQeX
— Telugu Scribe (@TeluguScribe) February 26, 2026